Raja Saab : వరుసగా భారీ సినిమాలను చేస్తూ ముందుకు పోతున్న ప్రభాస్(Rebel Star Prabhas), మారుతి(Maruthi) లాంటి మామూలు కమర్షియల్ డైరెక్టర్ తో ‘రాజా సాబ్'(The Raja Saab) సినిమా చేయడానికి ఒప్పుకోవడం అప్పట్లో పెద్ద హాట్ టాపిక్ గా మారింది. అభిమానులు అయితే ఈ ప్రాజెక్ట్ ని వ్యతిరేకిస్తూ, వెంటనే ఆపేయాలి అంటూ ట్విట్టర్ లో ఎన్నో ట్వీట్స్ కూడా వేశారు. కానీ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ని విడుదల చేసిన తర్వాత కూల్ అయిపోయారు. మారుతీ తన కంఫర్ట్ జోన్ ని దాటి ఈ సినిమాని ప్రభాస్ రేంజ్ లో తెరకెక్కిస్తున్నాడని అభిమానులు అర్థం చేసుకున్నారు. కానీ ఈ సినిమా ఫైనల్ ఔట్పుట్ విషయం లో ప్రభాస్ సంతృప్తి గా లేడని ఇండస్ట్రీ వర్గాల్లో గత కొంతకాలం నుండి ఒక వార్త సోషల్ మీడియా లో తెగ చక్కర్లు కొడుతోంది. సినిమా కంటెంట్ బాగానే ఉన్నప్పటికీ, VFX వర్క్ చాలా నాసిరకంగా ఉందని ప్రభాస్ అన్నాడట.
Also Read : ప్రభాస్ ‘రాజా సాబ్’ ఆ చిత్రానికి రీమేకా..? ఆసక్తి రేపుతున్న తలుపుల స్టోరీ!
వెంటనే VFX విషయం లో రీ వర్క్ చేయాల్సిన అవసరం ఉందని, హై క్వాలిటీ వచ్చే వరకు విడుదల తేదీని ప్రకటించవద్దని నిర్మాతలతో ప్రభాస్ చెప్పినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో గత కొంతకాలం నుండి పుకార్లు షికార్లు చేసాయి. అయితే అభిమానులు సోషల్ మీడియా లో ఈ చిత్రం విడుదల తేదీ గురించి మేకర్స్ ని ట్యాగ్ చేస్తూ ప్రతీ రోజు ప్రశ్నలు అడుగుతూనే ఉన్నారు. అయితే ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు మారుతీ ట్విట్టర్ లో ఇచ్చిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. అభిమాని అడిగిన ప్రశ్న ఏమిటంటే ‘ఈ సినిమాకి బెటర్ ఔట్పుట్ ని ఇచ్చేందుకు మీకు కావాల్సినంత సమయం తీసుకోండి. కానీ నవంబర్ లో విడుదల చేస్తారా?, లేదా డిసెంబర్ లో విడుదల చేస్తారా?, అసలు ఈ ఏడాదిలో విడుదల అవుతుందా లేదా అనే క్లారిటీ అధికారికంగా ఇవ్వండి, మా అభిమానులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు’ అని అడుగుతాడు.
దానికి మారుతీ సమాధానం చెప్తూ ‘ మీ అందరికీ అద్భుతమైన థియేట్రికల్ అనుభూతిని ఇవ్వడానికి మూవీ టీం మొత్తం కష్టపడుతుంది. VFX వర్క్ ధ్రువీకరణ పూర్తి అయిన వెంటనే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ మీకు అధికారికంగా విడుదల తేదీని ప్రకటిస్తుంది. అప్పటి వరకు కాస్త ఓపిక పట్టండి. ఇప్పటికే ఒక కంపెనీ నుండి వచ్చిన VFX షాట్స్ బాగున్నాయి. మిగిలిన కంపెనీల నుండే వచ్చే VFX షాట్స్ కూడా బాగుంటాయని ఆశిస్తున్నాను. కొంత టాకీ పార్ట్ బ్యాలన్స్ ఉంది. కొన్ని పాటల చిత్రీకరణ చేయాల్సి ఉంది. అవన్నీ పూర్తి అయిన వెంటనే మొదటి లిరికల్ వీడియో ని విడుదల చేస్తాము’ అంటూ చెప్పుకొచ్చాడు. మారుతీ ఇచ్చిన సమాధానం ని బట్టీ చూస్తే ప్రభాస్ VFX వర్క్ విషయం లో మేకర్స్ పై చాలా ఒత్తిడి పెడుతున్నాడు అంటూ వస్తున్న వార్తల్లో నిజం ఉందని తెలుస్తుంది. చూడాలి మరి ఆయన సంతృప్తి పడే విధంగా ఔట్పుట్ వస్తుందా లేదా అనేది.
Also Read : చిక్కుల్లో రాజా సాబ్… ప్రభాస్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్!