Rajasaab Movie Update : రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) హీరో గా నటిస్తున్న ‘రాజా సాబ్'(Raja Saab Movie) చిత్రం కోసం ఆయన అభిమానులు ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎందుకంటే ‘కల్కి’ చిత్రం విడుదలై ఏడాది పూర్తి అయ్యింది. ఏడాది కచ్చితంగా రెండు సినిమాలు చేస్తానని అభిమానులకు మాట ఇచ్చిన ప్రభాస్, ఈ ఏడాదిని ఖాళీగా ఉంచేస్తాడేమో అని భయపడ్డారు. కానీ ఈ చిత్రాన్ని ‘డిసెంబర్ 5’ న విడుదల చేయబోతున్నాము అంటూ కాసేపటి క్రితమే మేకర్స్ ఒక సరికొత్త పోస్టర్ ద్వారా అభిమానులకు తెలిపారు. ఆ పోస్టర్ లో ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని ఈ నెల 16 న విడుదల చేయబోతున్నట్టు కూడా తెలిపారు. ఇప్పటి వరకు ఈ సినిమా పై అంచనాలు మామూలు రేంజ్ లోనే ఉన్నాయి. కానీ టీజర్ తర్వాత ఆ అంచనాలు ఎవ్వరూ ఊహించని రేంజ్ కి వెళ్తాయని అంటున్నారు ఫ్యాన్స్.
ఇకపోతే గత ఏడాది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2’ చిత్రం కూడా ఇదే డిసెంబర్ 5న విడుదలై సంచలనాలను నమోదు చేసింది. పాన్ ఇండియా లెవెల్ లో ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది. ఆ సినిమా ఎలా అయితే బాక్స్ ఆఫీస్ వద్ద మ్యాజిక్ ని క్రియేట్ చేసిందో, ‘రాజా సాబ్’ కూడా అలాంటి మ్యాజిక్ ని రిపీట్ చేస్తుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. మారుతీ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ చిత్రంలో హీరోయిన్స్ గా నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ నటించారు. ఇందులో నిధి అగర్వాల్ క్యారక్టర్ అందరినీ షాక్ కి గురి చేసేలా ఉంటుందని టాక్. రెగ్యులర్ హారర్ కామెడీ థ్రిల్లర్ చిత్రం మాత్రం ఇది కాదని, ఇప్పటి వరకు ఇండియన్ సినీ ఇండస్ట్రీ హిస్టరీ లో ఇలాంటి కాన్సెప్ట్ తో సినిమా రాలేదని అంటున్నారు.
Also Read : అసలు ‘రాజా సాబ్’ కి ఏమైంది..? ప్రభాస్ ఎందుకు అంత ఫైర్ అవుతున్నాడు!
ఈ చిత్రానికి థమన్ సంగీత దర్శకత్వం వహించాడు. సినిమా మొదలై చాలా కాలం అయ్యింది కాబట్టి, థమన్ అప్పటి ట్రెండ్ కి తగ్గట్టుగా మ్యూజిక్ కొట్టాడట. కానీ ఎందుకో ఆ మ్యూజిక్ ఆయనకు కూడా నాసిరకంగా అనిపించడంతో రీసెంట్ గానే మళ్ళీ కొత్త ట్యూన్స్ ని రెడీ చేసాడట. ఈ కొత్త ట్యూన్స్ చాలా అద్భుతంగా వచ్చాయని, కేవలం మ్యూజిక్ తోనే ఈ చిత్రానికి హైప్ క్రియేట్ అవుతుందని అంటున్నారు. ఇక షూటింగ్ వివరాల విషయానికి వస్తే ప్రభాస్ కి సంబంధించి కేవలం 15 రోజుల టాకీ పార్ట్ మాత్రమే బ్యాలన్స్ ఉందట. అదే విధంగా పాటల చిత్రీకరణ కోసం మరో 25 రోజుల షూటింగ్. మొత్తం మీద 40 రోజుల షూటింగ్ బ్యాలన్స్ ఉందట. ఇక నుండి ప్రతీ నెల ఈ సినిమాకు సంబంధించి ఎదో ఒక అప్డేట్ వస్తూనే ఉంటుందని అంటున్నారు మూవీ టీం. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఈ చిత్రం ఎలాంటి అంచనాలను క్రియేట్ చేయబోతుంది అనేది.
— ٰ (@Herbb_69) June 3, 2025