Australia: ఆస్ట్రేలియాలో భారత సంతతి వ్యక్తి ని పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. తమ నివాసానికి వచ్చి పోలీసులు తన భర్తను అదుపులోకి తీసుకొని అతడిని చిత్రహింసలకు గురి చేశారని గౌరవ్ భార్య అమృత్ పాల్ కౌర్ ఆరోపించారు. గౌరవ్ ను బలవంతంగా నేలపై పడేసి పోలీసులు హింసించారని తానే నేరం చేయలేదని అతడు ఎంత వేడుకున్న కనికరించలేదుని ఆమె తెలిపారు. కింద పడిన తన భర్త మెడను ఓ పోలీసు అధికారి మోకాలితో గట్టిగా అదిమి పట్టాడని అన్నారు.