Rajamouli Remuneration : ఇండియా లో ఇప్పుడు అందరికంటే పెద్ద సూపర్ స్టార్ ఎవరంటే కళ్ళు మూసుకొని ఎవరైనా చెప్పే పేరు దర్శక ధీరుడు రాజమౌళి అనే. ఒక సీరియల్ డైరెక్టర్ గా కెరీర్ ని ప్రారంభించి, స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో డైరెక్టర్ గా మారి, అపజయం అనేదే ఎరుగని డైరెక్టర్ గా ఇండస్ట్రీ లో ముందుకు సాగుతూ ‘మగధీర’ చిత్రం తో తెలుగు సినిమా స్థాయిని పెంచి, బాహుబలి సినిమాతో మన ఇండస్ట్రీ కి పాన్ ఇండియా మార్కెట్ తలుపులు తెరిచి, ఇప్పుడు #RRR చిత్రం తో పాన్ వరల్డ్ మార్కెట్ లోకి కూడా అడుగుపెట్టి, ఆస్కార్ అవార్డు ని కూడా మన తెలుగు సినిమాకి దక్కేలా చేసిన ఘనుడు ఆయన. అలాంటి దర్శకుడితో పని చెయ్యాలని ప్రతీ స్టార్ హీరో కి ఉంటుంది. ఆయన తో సినిమా ఒక వరం లాగ భావిస్తుంటారు. ఇన్ని రోజులు కేవలం తెరవెనుక అద్భుతాలు సృష్టించిన రాజమౌళి, ఇక నుండి తన బ్రాండ్ ఇమేజి ని మల్టీనేషనల్ ప్రొడక్ట్స్ కి కూడా ఉపయోగించబోతున్నాడు.
రీసెంట్ గా ఆయన ‘ఒప్పో’ మొబైల్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించేందుకు ఒప్పందం కుదిరించుకున్నాడు. ఈ బ్రాండ్ కి సంబంధించిన యాడ్ షూటింగ్ ని రీసెంట్ గానే హైదరాబాద్ లో షూట్ చేసారు. ఈ యాడ్ లో స్టైల్ లో సూటు బూతు వేసుకొని, సాల్ట్ & పెప్పర్ లుక్ లో కనిపిస్తున్న రాజమౌళి ని చూసి నెటిజెన్స్ షాక్ కి గురయ్యారు. ఇంత స్టైలిష్ గా రాజమౌళి ని చూడడం ఇదే తొలిసారి. ఈ చిన్న యాడ్ కోసం రాజమౌళి మూడు కోట్ల రూపాయిలు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట.
కేవలం ఒకరిద్దరు టాప్ హీరోలు మినహా, మిగిలిన ఎవ్వరూ కూడా ఈ రేంజ్ రెమ్యూనరేషన్ ని తీసుకోవడం లేదు. దీనిని బట్టీ రాజమౌళి బ్రాండ్ ఇమేజి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఇది ఇలా ఉండగా రాజమౌళి తన తదుపరి చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబు తో చెయ్యబోతున్న సంగతి అందరికీ తెలిసిందే, ఈ చిత్రం ప్రారంభోత్సవం మహేష్ బాబు పుట్టిన రోజు నాడు ఆగష్టు 9 వ తారీఖున జరగబోతుంది.
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Read MoreWeb Title: Rajamoulis brand surpassing star heroes three crore remuneration taken for oppo mobile ad
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com