Rajamouli: ప్రముఖ టాలీవుడ్ టాప్‌మోస్ట్ ఫేస్ డైరెక్టర్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సినిమా ఆర్ఆర్ఆర్. ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా వస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే విడుదల సమయంలో ఎలాంటి అవాంతరాలు లేకుండా.. జక్కన్న జాగ్రత్త పడుతున్నారు. ఈ సినిమా రిలీజ్ సమయానికి భీమ్లానాయక్‌తో పాటు మరికొన్ని భారీ ప్రాజెక్ట్ సినిమాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. అయితే, తాజాగా నిర్మాతల సమావేశం నిర్వహించగా.. ఆర్ఆర్ఆర్కు దారి ఇస్తూ.. సర్కారు వారి పాట, భీమ్లానాయక్, ఎఫ్3 సినిమాలు వెనక్కి తగ్గాయి. ఈ విషయాన్ని అధికారికంగా మేకర్స్ కూడా ప్రకటించారు. ఈ క్రమంలోనే రాజమౌళి సదరు సినిమా బృందానికి ట్విట్టర్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు.
The decision by Chinababu garu and Pawan Kalyan garu to defer the release date of #BheemlaNayak is well appreciated. Wishing the team all the very best…:)
— rajamouli ss (@ssrajamouli) December 21, 2021
Also Read: RRR: తమిళంలో ఆర్ఆర్ఆర్ పై కుట్ర జరుగుతుందా ?
సర్కారు వారి పాట గురించి మాట్లాడుతూ.. ఈ సినిమా నిజంగా సంక్రాంతికి రావాల్సింది. కానీ, పరిస్థితి అర్థం చేసుకుని మంచి మనసుతో వాయిదా వేసిన మహేశ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు.. అంటూ చెప్పుకొచ్చారు. అలాగే భీమ్లానాయక్‌ని వేసిన చినబాబు, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలంటూ ట్వీట్ చేశారు. ఈ సినిమా కూడా మంచి సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఇక ఎఫ్3 గురించి స్పందించిన జక్కన్న.. దిల్ రాజు, చిత్రబృందానికి థ్యాంక్స్ చెప్పారు.
https://twitter.com/ssrajamouli/status/1473219054487760896?s=20
ఇప్పటికే సినిమా విడుదల తేదీని ప్రకటించి ప్రమోషన్స్‌లో జోరు పెంచిన రాజమౌళి.. ఇటీవల ముంబయిలో ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. కాగా, ఈ సినిమా ట్రైలర్‌తోనే భారీ అంచనాలు క్రియేట్ చేసింది. మరి థియేటర్లలో ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి.
Also Read: RRR: ఆర్ఆర్ఆర్లో ఆ ఒక్క సీన్ అరుపులే అంటున్న రాజమౌళి