https://oktelugu.com/

మళయాళ నటికి ఆకతాయి వేధింపులకు కారణాలేంటి?

Parvathy Thiruvothu: రామచిలక ఓసారి బ్రహ్మదేవుడిని వేడుకుందట తనకెందుకీ బంధాలు అంటే పిచ్చిదాన నిన్నెవరు బంధించారు? నీ అందమే నీకు బంధమైంది అన్నాట్ట. లోకంలో అందంగా ఉండటం కూడా ఓ ప్రమాదమే. వారికి తరచు ప్రమాదాలు ఎదురవుతూనే ఉంటాయి. అది రోడ్డు మీదో ఇంకో చోటనో కాదు. కథానాయికలకు కూడా ఆకతాయిల నుంచి వేధింపులు కొత్తేమీ కాదు. అలాంటి సంఘటనలు గతంలో కూడా పలుమార్లు జరిగాయి. ఈ నేపథ్యంలో అందాల భామలకు ఇతరుల నుంచి ముప్పు తప్పేలా […]

Written By:
  • Srinivas
  • , Updated On : December 21, 2021 / 05:31 PM IST
    Follow us on

    Parvathy Thiruvothu: రామచిలక ఓసారి బ్రహ్మదేవుడిని వేడుకుందట తనకెందుకీ బంధాలు అంటే పిచ్చిదాన నిన్నెవరు బంధించారు? నీ అందమే నీకు బంధమైంది అన్నాట్ట. లోకంలో అందంగా ఉండటం కూడా ఓ ప్రమాదమే. వారికి తరచు ప్రమాదాలు ఎదురవుతూనే ఉంటాయి. అది రోడ్డు మీదో ఇంకో చోటనో కాదు. కథానాయికలకు కూడా ఆకతాయిల నుంచి వేధింపులు కొత్తేమీ కాదు. అలాంటి సంఘటనలు గతంలో కూడా పలుమార్లు జరిగాయి. ఈ నేపథ్యంలో అందాల భామలకు ఇతరుల నుంచి ముప్పు తప్పేలా కనిపించడం లేదు.

    Parvathy Thiruvothu

    మళయాళ నటి పార్వతి తిరువొత్తు. ఇటీవల కాలంలో తన నటనతో గుర్తింపు తెచ్చుకుంది. చార్లీ, బెంగుళూరు డేస్, టే కాఫ్ వంటి సినిమాలతో తనదైన ప్రతిభ చూపించింది. ఈ మధ్య ఆమెకు ఓ వ్యక్తి నుంచి వేధింపులు పెరిగాయి. గత రెండేళ్లుగా వెంట పడుతుండటంతో డిసెంబర్ 20న పోలీసులు అతడిని అరెస్టు చేశారు. వేధింపులు ఎక్కువ కావడంతో ఆమె భరించలేకపోయినట్లు తెలుస్తోంది.

    కొల్లాంలో నివాసముండే హర్ష అనే వ్యక్తి పలుమార్లు పార్సిల్ పట్టుకుని పార్వతి ఇంటికి వెళ్లేవాడు. ఈ క్రమంలో చాలా సార్లు వార్నింగ్ కూడా ఇచ్చింది. కానీ అతడిలో మార్పు రాలేదు. చీటికి మాటికి వస్తూ ఇబ్బందులు పెట్టేవాడు. దీంతో సహించలేకపోయిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు.

    Also Read: Pushpa Collections: ‘పుష్ప’ లేటెస్ట్ కలెక్షన్స్.. బాక్సాఫీస్ షేక్ అయింది !

    గతంలో కూడా పార్వతిపై పలుమార్లు ఆకతాయిల వేధింపులు వచ్చినట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా ఆమె మొబైల్ కు కూడా పలు అసభ్యకర సందేశాలు వస్తుండటంతో పోలీసులను ఆశ్రయించింది. దీంతో ఐపీసీ 354 డీ సెక్షన్ కింద అతడిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. దీంతో హీరోయిన్లకు ఆకతాయిల నుంచి ఎప్పుడు ముప్పే పొంచి ఉందని చాలా సంఘటనలు రుజువు చేశాయి. ఈ నేపథ్యంలో కథానాయికలకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలుస్తోంది.

    Also Read: Shyam Singha Roy: ‘శ్యామ్​ సింగరాయ్’​లో కిస్ సీన్​పై యాంకర్​ డౌట్​.. స్ట్రాంగ్​ కౌంటర్ ఇచ్చిన సాయిపల్లవి

    Tags