KGF chapter 1 : భారతీయ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ‘పాన్ ఇండియా’ అనే మాటను మంత్రంగా పఠిస్తున్నారు ఫిల్మ్ మేకర్స్. మరి ఆ మంత్రానికి కారణం.. అలాగే పాన్ ఇండియాకి బలమైన పునాది వేసిన సినిమా అంటే.. బాహుబలి తర్వాత ‘కేజీఎఫ్-చాప్టర్1’. ఈ సినిమాకి దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. సౌత్ సినిమాల పై అందరి చూపు పడింది అంటే దానికి ముఖ్య కారణం కూడా ‘కేజీఎఫ్-చాప్టర్1’.

నేడు పాన్ ఇండియా రేంజ్ నే లక్ష్యంగా సినిమాలు చేస్తున్నారంటే కారణం.. ఈ సినిమానే. యష్ హీరోగా శ్రీనిథి శెట్టి హీరోయిన్ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2018వ సంవత్సరం డిసెంబర్ 21న ఎటువంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయింది. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం రికార్డుల మోత మోగించింది. భారీ కలెక్షన్స్ రాబట్టింది.
అయితే, నేటితో ఈ చిత్రం విడుదలై కరెక్ట్ గా 3 ఏళ్ళు అవుతుంది. మరి తెలుగులో ఈ భారీ యాక్షన్ డ్రామా ఎంతవరకు కలెక్ట్ చేసిందో చూద్దాం.
నైజాం 4.75 కోట్లు
సీడెడ్ 2.30 కోట్లు
ఉత్తరాంధ్ర 1.46 కోట్లు
ఈస్ట్ 1.72 కోట్లు
వెస్ట్ 0.60 కోట్లు
గుంటూరు 0.91 కోట్లు
కృష్ణా 1.13 కోట్లు
నెల్లూరు 0.31 కోట్లు
ఇక ఏపీ మరియు తెలంగాణ మొత్తం కలుపుకుని చూస్తే : 12.18 కోట్లు
Also Read: మళయాళ నటికి ఆకతాయి వేధింపులకు కారణాలేంటి?
ఒక విధంగా ‘కేజీఎఫ్ 1’కి అన్యాయమే జరిగింది. రావాల్సిన స్థాయిలో కలెక్షన్స్ రాలేదు. పైగా రివ్యూస్ కూడా ఈ సినిమాకి చాలా బ్యాడ్ గా వచ్చాయి. కానీ, ఈ సినిమా యాక్షన్ జోనర్ లోనే గొప్ప సినిమాగా శాశ్వతంగా నిలిచిపోతుంది. అందుకే, యాక్షన్ లవర్స్ ఈ సినిమా సీక్వెల్ కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.
అందుకు తగ్గట్టుగానే షార్ప్ అండ్ స్టైలిష్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ `కేజీఎఫ్ చాప్టర్- 2` అద్భుతంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు. నిజానికి ఎప్పుడో ఈ సినిమా సీక్వెల్ ఫస్ట్ కాపీతో రెడీగా ఉంది. అందుకే సమ్మర్ ను టార్గెట్ గా పెట్టుకుని రిలీజ్ కి సిద్ధం చేస్తున్నారు.