Rajamouli and Mahesh Babu : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది దర్శకులు ఉన్నప్పటికి వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేసిన దర్శకుడిగా రాజమౌళి చాలా గొప్ప గుర్తింపును సంపాదించుకున్నాడు. అలాంటి దర్శకుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండడం నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి… ఆయనకి ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది అభిమానులు ఉన్నారు…
Also Read : రాజమౌళి, మహేష్ బాబు మూవీ పై ఆసక్తికరమైన పోస్టు వేసిన ఒడిశా ఉప ముఖ్యమంత్రి!
తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శక ధీరుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న దర్శకుడు రాజమౌళి… ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలన్నీ కూడా మంచి విజయాలను సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక ఎనలేని గుర్తింపును కూడా తీసుకొచ్చి పెడుతున్నాయి. మరి ఇలాంటి సందర్భంలో ఆయన చేస్తున్న ప్రతి సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరమైతే ఉంది. ఆయన చేస్తున్న ప్రతి సినిమా యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని మెప్పిస్తూ ఆయనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసి పెడుతున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఈ దర్శకుడికి లేనటువంటి క్రేజ్ ను సొంతం చేసుకున్న రాజమౌళి ఇప్పుడు మహేష్ బాబుతో చేస్తున్న పాన్ వరల్డ్ సినిమాతో భారీ విజయాన్ని అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకత్తయితే ఇకమీదట చేయబోయే సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి.
ఇక ఇప్పటికే ఆయన చేసిన సినిమాలన్నీ వరుస విజయాలను సాధిస్తున్న నేపధ్యం లో ఈ సినిమా కూడా భారీ విజయాన్ని సాధించబోతుంది అంటూ కొన్ని వార్తలైతే బయటికి వస్తున్నాయి. ఇక ప్రస్తుతం దానికి సంబంధించిన సెకండ్ షెడ్యూల్ ని ఒరిస్సాలో షూట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఒక ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో అడ్వెంచర్ సీన్స్ ను తెరకెక్కిస్తున్నారట. గుర్రపు స్వారీ చేస్తూ నిధి వేటలో మహేష్ బాబు ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది…దానికి తగ్గట్టుగానే ఈ సినిమాకి ఫైట్ మాస్టర్ల తో కలిసి రాజమౌళి ఈ సీన్స్ ని తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సీన్ కి సంబంధించిన ఒక సన్నివేశం కూడా లీక్ అయింది అంటూ మరోసారి కొన్ని వార్తలైతే వినిపిస్తున్నాయి. అయినప్పటికి వీటిలో ఎంతవరకు నిజం ఉంది అనే విషయం అయితే సరిగ్గా తెలియదు. కానీ మొత్తానికైతే ఈ సినిమా అయితే నెక్స్ట్ లెవెల్లో తెరకెక్కుతుందనే వార్తలైతే వినిపిస్తున్నాయి.
మరి మొత్తానికైతే రాజమౌళి ఈ సినిమాతో మరోసారి వరల్డ్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేసే ప్రయత్నమైతే చేస్తున్నాడు. తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో భారీ విజయాన్ని సాధిస్తాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…ఇక ఏది ఏమైనా కూడా రాజమౌళి లాంటి టాలెంటెడ్ డైరెక్టర్ నుంచి ఒక సినిమా వస్తుంది అంటే చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు…
Also Read : అడ్వెంచర్ మాత్రమే కాదు..సైన్స్ ఫిక్షన్ కూడా..రాజమౌళి, మహేష్ సినిమా గురించి సంచలన అప్డేట్!