Seediri Appalaraju (1)
Seediri Appalaraju: కూటమి ప్రభుత్వం( Alliance government) దూకుడు మీద ఉంది. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దూకుడు కలిగిన నేతలపై ఫోకస్ పెట్టింది. రాజకీయ ప్రత్యర్థులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కేసులు నమోదు చేస్తోంది. వారి అరెస్టుల పర్వం కూడా కొనసాగుతోంది. ఇటువంటి తరుణంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలిగిన నాయకులు సైలెంట్ అవుతున్నారు. అందులో ఒకరు మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు. శ్రీకాకుళం జిల్లా పలాస నుంచి 2019లో గెలిచారు అప్పలరాజు. ప్రత్యేక పరిస్థితుల్లో ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు. దీంతో చాలా దూకుడుగా ఉండేవారు అప్పలరాజు. ప్రధానంగా అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబుపై విరుచుకుపడేవారు. తన రాజకీయ ప్రత్యర్థి, సర్దార్ గౌతు లచ్చన్న మనుమరాలు శిరీషపై తీవ్ర స్థాయిలో రెచ్చిపోయేవారు.
Also Read: జనసేన ప్లీనరీ.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి షాక్.. ఊహించని చేరికలు!
* డాక్టర్ గా సుపరిచితులు
మత్స్యకార వర్గానికి చెందిన అప్పలరాజు( appala Raju ) డాక్టర్ గా ఆ ప్రాంతంలో సుపరిచితులు. 2019 ఎన్నికలకు ముందు కీలక నియోజకవర్గాలపై దృష్టి పెట్టారు జగన్మోహన్ రెడ్డి. ఆ సమయంలో యువకుడు, ఆపై విద్యావంతుడుగా నిలిచిన అప్పలరాజు పై దృష్టి పడింది. మత్స్యకార కోటా కింద ఆయనకు టికెట్ కట్టబెట్టారు. ఆ ఎన్నికల్లో అప్పలరాజు గెలిచారు. మోపిదేవి వెంకటరమణ మంత్రి పదవికి రాజీనామా చేయడంతో ఆ వర్గానికి చెందిన అప్పలరాజుకు అనుకొని అవకాశం దక్కింది. 2024 వరకు ఆయన మంత్రిగా కూడా కొనసాగారు. అయితే జగన్మోహన్ రెడ్డి పై వీర విధేయత ప్రదర్శించిన నేతల్లో అప్పలరాజు ఒకరు. ఈ క్రమంలో రాజకీయ ప్రత్యర్థులపై అనుచిత వ్యాఖ్యలు చేసేవారు. తన ప్రత్యర్థులైన గౌతు శిరీష పై సోషల్ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేయించారన్న ఆరోపణలు ఆయనపై ఉన్నాయి.
* అప్పట్లో వేధింపులు
పలాస నియోజకవర్గంలో( Palasa consistution) అప్పలరాజు వేధింపులతో ఒకరిద్దరు టిడిపి నేతలు ఆత్మహత్య చేసుకున్నారని అప్పట్లో ఆరోపణలు వినిపించాయి. పైగా గౌతు శిరీష సిఐడి నోటీసులు అప్పట్లో ఇప్పించారు అప్పలరాజు. సిఐడి రాష్ట్ర కార్యాలయానికి వెళ్లి శిరీష వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితిని తెచ్చారు. అదే సమయంలో తనపై సోషల్ మీడియాలో వ్యతిరేక ప్రచారం చేయించిన అప్పలరాజు పై పోలీసులకు ఫిర్యాదు చేశారు శిరీష. కానీ అప్పట్లో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడంతో వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అదే అప్పలరాజు పై మూడు కేసులు నమోదయ్యాయి. అయితే అప్పటివరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ గా కనిపించిన అప్పలరాజు ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు.
* లోపల వేస్తారంటూ భయం..
ఇటీవల ఓ టీవీ ఛానల్( TV channel debate) డిబేట్ కు హాజరయ్యారు అప్పలరాజు. చాలావరకు భయపడుతూ మాట్లాడారు. అయినదానికి కాని దానికి కూటమి ప్రభుత్వం ఏదైనా మాట్లాడితే లోపల వేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే శ్రీకాకుళం జిల్లాలో దువ్వాడ శ్రీనివాస్ తో పాటు అప్పలరాజు అప్పట్లో సంచలన వ్యాఖ్యలు చేసేవారు. చంద్రబాబుతో పాటు లోకేష్ లపై తరచూ విమర్శలు చేసేవారు. ఆ భయంతోనే అప్పలరాజు పొలిటికల్ గా సైలెంట్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికీ వల్లభనేని వంశీ మోహన్, పోసాని కృష్ణ మురళి, బోరుగడ్డ అనిల్ కుమార్ జైలు జీవితం గడుపుతున్నారు. కొడాలి నాని, పేర్ని నాని, రోజా వంటి మాజీ మంత్రులపై కూటమి ఫోకస్ పెట్టింది. అందుకే అప్పలరాజు సైతం సైలెంట్ అయినట్లు సమాచారం.
Also Read: ఆ దోపిడీదారుడు జగన్ సోదరుడు.. 30 ఇయర్స్ పృథ్వీ సంచలన ట్వీట్!