https://oktelugu.com/

Kerala : చేప కాటుతో జీవితం తారుమారు.. రైతులకు ప్రాణాంతక వ్యాధి.. చివరికీ చేయే పోయింది

Kerala : ఇప్పటి వరకు కుక్క, తేలు, పాము కాటుతో ప్రాణాలు కోల్పోయిన వారి గురించి విన్నాం. కుక్క కాటుకు గురై రేబీస్ వ్యాధి బారిన పడి ఆస్పత్రిలో చికిత్స పొందిన వారిని చూశాం.

Written By:
  • Rocky
  • , Updated On : March 14, 2025 / 12:05 PM IST
    Kerala

    Kerala

    Follow us on

    Kerala : ఇప్పటి వరకు కుక్క, తేలు, పాము కాటుతో ప్రాణాలు కోల్పోయిన వారి గురించి విన్నాం. కుక్క కాటుకు గురై రేబీస్ వ్యాధి బారిన పడి ఆస్పత్రిలో చికిత్స పొందిన వారిని చూశాం. కానీ ఓ వ్యక్తి మాత్రం చేప కాటు గురై తీవ్ర ఆనారోగ్య పాలైన సంఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా నిలిచింది. ఈ సంఘటనతో అసలు చేపలు కూడా ఇంత డేంజరా అని తీవ్ర భయాందోళనలు కలుగుతున్నాయి. చేప కాటుకు గురైన రైతుకు మొదట చిన్న గాయం అయింది. అయితే రోజు తింటుంటాం కాదా కరిచింది పైగా చేపే కదా అని ఆ రైతు లైటుగా తీసుకున్నాడు. కానీ అది రోజు రోజుకు తీవ్రమవుతూ వచ్చింది. చివరికి ప్రాణాంతక ఇన్ఫెక్షన్‌ గా మారిపోయింది. చివరికి చేట కాటు వేసిన చేయిని డాక్టర్లు తొలిగించాల్సి వచ్చింది. కేరళలోని కన్నూరు జిల్లాలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయింది.

    Also Read : సన్నబడాలని తిండి మానేసింది.. చివరికి ప్రాణాలు..

    వివరాల్లోకి వెళితే.. కేరళలోని కన్నూర్ జిల్లా తలస్సేరి తాలుకా మడపీడిక గ్రామానికి చెందిన రజీష్(38) ఒక రైతు. తను ఫిబ్రవరి నెలలో ఓ నీటి గుంట శుభ్రం చేస్తుండగా ఓ చేప అతడిని కరిచింది. ఆ చేపను స్థానికులు కడు అని పిలుస్తారు. అయితే దానిని అతడు పెద్దగా పట్టించుకోలేదు. కానీ అదే చేప కాటుకు అతడికి ప్రాణాంతక బ్యాక్టీరియా ఇన్ ఫెక్షన్ సోకింది. చివరికీ చేప కాటుకు గురైన రజీష్ చేయి మణికట్టు వరకు తొలగించాల్సిన పరిస్థితి వచ్చింది. మొదట్లో గాయం చిన్నది అనిపించిందని.. తర్వాత కొద్ది రోజులకే తీవ్రంగా మారినట్లు ఆ రైతు తెలిపాడు.

    గాయం చూసి స్థానికంగా కొడయేరిలో ఉన్నటువంటి ప్రాథమిక ఆస్పత్రికి వెళ్లగా టెటనస్ ఇంజెక్షన్ ఇచ్చినట్లు తెలిపాడు. రోజు రోజుకు గాయం తీవ్రతరం కావడంతో తన కుటుంబ సభ్యులు మహేలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. ఆ తర్వాత మరింత మెరుగైన చికిత్స కోసం కోజికోడ్ డాక్టర్లు నిర్ధారించారు. ఇది శరీరంలోని కణజాలాన్ని నాశనం చేసి అందులో గ్యాస్ ను ఉత్పత్తి చేసే తీవ్ర బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ అని వెల్లడించారు. అప్పటికే ఇన్ఫెక్షన్ అరచేయి వరకు వ్యాపించినట్లు గుర్తించిన వైద్యులు రజీష్ చేతిని తొలగించాలని పేర్కొన్నారు. లేకపోతే మెదడు వరకు వ్యాపించి దానిని దెబ్బతీసే అవకాశం ఉందని హెచ్చరించారు. దీంతో రజీష్ తన చేతి మణికట్టు వరకు కోల్పోయాడు.

    ఈ ఘటన తర్వాత వైద్యులు తీవ్ర హెచ్చరికలను చేశారు. బురద నీటిలో పనిచేస్తుండేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అలాంటి బురద గుంటలలో గ్యాస్ గ్యాంగ్రీన్‌ ఇన్ఫెక్షన్‌కు కారణమయ్యే బ్యాక్టీరియా ఉంటుందని తెలిపారు. పని చేస్తున్నప్పుడు ఏదైనా గాయం అయితే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలని సూచించాడు.

    Also Read : ఈ కోడికి అగ్గితగలా.. ఇదేందయ్యా.. తట్టుకోలేక ఆర్డీవో కు ఫిర్యాదు