Rajamouli and Mahesh Babu : తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శక ధీరుడి గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న డైరెక్టర్ రాజమౌళి (Rajamouli)…బాహుబలి (Bahubali) సినిమాతో పాన్ ఇండియాలో భారీ సక్సెస్ ని సాధించిన ఆయన ఇప్పుడు మహేష్ బాబుతో చేస్తున్న సినిమాతో పాన్ వరల్డ్ లోకి ఎంటర్ ఇవ్వాలని చూస్తున్నాడు. ఈ సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ప్రపంచ సినిమా ప్రేక్షకులందరు ఇప్పటికే రాజమౌళి సినిమాల గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘త్రిబుల్ ఆర్’ (RRR) సినిమాతో ప్రపంచానికి తనను తాను పరిచయం చేసుకున్నాడు. అందువల్లే ఇప్పుడు మహేష్ బాబు(Mahesh Babu) తో చేస్తున్న సినిమా వల్ల యావత్ ప్రపంచ ప్రేక్షకులందరిని మరోసారి అలరిస్తూ జేమ్స్ కామెరూన్ పక్కన తన పేరు ను నిలుపుకోవాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్టుగా తెలుస్తోంది.
ఇక మహేష్ బాబు ఈ సినిమా కోసం రెమ్యూనరేషన్ ఎంత తీసుకుంటున్నాడు అనే విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి…నిజానికి మహేష్ బాబు రెమ్యూనరేషన్ ఏం తీసుకోవడం లేదు. సినిమా సక్సెస్ అయితే అందులో వచ్చే ప్రాఫిట్స్ లో నుంచే షేర్ అయితే తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది.
Also Read : మహేష్ బాబు సినిమాకోసం రాజమౌళి మొదటి సారి ఇలా చేస్తున్నాడా..?
ఇక రాజమౌళి – మహేష్ బాబు ఇద్దరు కూడా ఇదే బాటలో నడుస్తున్నారు. ఈ సినిమా దాదాపు 1200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతుంది. 3000 కోట్లకు పైన కలెక్షన్లు రాబడుతుందనే అంచనాలో సినిమా మేకర్స్ అయితే ఉన్నారు. మరి దానికి తగ్గట్టుగానే ఈ సినిమా భారీ కలెక్షన్స్ ని రాబట్టి అటు ప్రొడ్యూసర్ కి ఇటు మహేష్ బాబు రాజమౌళి లకు కూడా భారీ లాభాలను తీసుకొస్తుందనే ఉద్దేశ్యంతో సినిమా మేకర్స్ అయితే ఉన్నారు.
మరి మొత్తానికైతే ఈ సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా స్థాయి అనేది తారా స్థాయికి చేరుకోబోతుంది అనేది స్పష్టంగా తెలుస్తోంది. రాజమౌళి (Rajamouli) తన ముద్రని ప్రపంచ సినిమా ప్రేక్షకుడిపైన వెయ్యడమే కాకుండా జేమ్స్ కామెరూన్ (James Cameroon) లాంటి దిగ్గజ దర్శకుడి పక్కన తన పేరు నిలుపుకోవాలనే ఒక ఉత్సాహంతోనే ఈ సినిమా కోసం ఆయన తీవ్రంగా కష్టపడుతున్నట్టుగా తెలుస్తోంది.
Also Read : 3000 మందితో పడవలో మహేష్ బాబు పోరాటం..రాజమౌళి మార్క్ సన్నివేశం!