Bobby : మెగాస్టార్ చిరంజీవి గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉన్నంతకాలం ఆయన పేరు చిరస్మరణీయంగా నిలిచిపోతుంది. ఆయన సాధించిన విజయాలు, ఆయన అందుకున్న అవార్డులు ఆయనను చాలా గొప్ప స్థానంలో నిలబెట్టాయి. ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు ఒకతైతే 70 సంవత్సరాల వయసులో కూడా సినిమాలను చేస్తూ మంచి విజయాలను అందుకోవడానికి ఆయన ముందుకు అడుగులు వేస్తున్నాడు… ఇక ప్రస్తుతం ఆయన వశిష్ట (Vashishta), అనిల్ రావిపూడి (Anil Ravipudi), శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) లాంటి దర్శకులతో సినిమాలు చేయడానికి కమిట్ అయ్యాడు. ఇక ఈ సినిమా లైనప్ ముగిసిన తర్వాత బాబీ డైరెక్షన్లో మరొక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే వీళ్ళ కాంబినేషన్లు ‘వాల్తేరు వీరయ్య’ అనే సినిమా వచ్చింది. ఈ సినిమాతో బాలయ్య అటు చిరంజీవి ఇటు బాబీ ఇద్దరు కూడా మంచి విజయాన్ని దక్కించుకున్నారు. ఇక బాబీ బాలయ్య బాబుతో చేసిన డాకు మహారాజ్ సినిమా మంచి విజయాన్ని సాధించడమే కాకుండా దర్శకుడిగా బాబీకి ఒక మంచి గుర్తింపును కూడా తీసుకొచ్చి పెట్టింది. దానివల్లే ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పుడు చిరంజీవితో బాబీ మరొక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు.
చిరంజీవి కూడా దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మరి ప్రస్తుతం చిరంజీవికి ఉన్న కమిట్ మెంట్స్ మొత్తం పూర్తయిన తర్వాత బాబి డైరెక్షన్లో సినిమా చేసే అవకాశాలైతే ఉన్నాయి. అంటూ మరి కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
Also Read : డైరెక్టర్ బాబీ కి హీరో దొరకడం కష్టమేనా..? ఆ ఒక్క విషయం మార్చుకుంటే ఈ హీరో డేట్స్ ఇచ్చే అవకాశం ఉందా..?
చిరంజీవి ఇమేజ్ ను పర్ఫెక్ట్ గా వాడుకొని మరోసారి మరో బ్లాక్ బస్టర్ ని సాధించాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది… ఇక ఈ విషయాన్ని తెలుసుకున్న కొంతమంది ప్రేక్షకులు మాత్రం చిరంజీవి ఎప్పుడు బాబీ (Babi) లాంటి దర్శకుడు తో రొటీన్ కమర్షియల్ సినిమాలను చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నాడు. కొన్ని ఎక్స్పరిమెంటల్ సినిమాలను చేసి మంచి విజయాలను సాధించొచ్చు కదా అంటూ అతని మీద కొన్ని విమర్శలైతే చేస్తున్నారు. మరి ఏది ఏమైనా కూడా ఒక సినిమా సక్సెస్ అయితే ఆ దర్శకుడికి, ఆ హీరోకి మంచి గుర్తింపైతే వస్తుంది.
ఇలాంటి స్టార్ హీరో ఇప్పటివరకు విభిన్నమైన తరహా పాత్రాలను పోషించినప్పటికి ఆయన చేయనటువంటి కొన్ని ఎక్స్పరిమెంటల్ క్యారెక్టర్స్ ను చేసి ప్రేక్షకులను మెప్పిస్తే బాగుంటుంది అంతే తప్ప రొటీన్ రెగ్యులర్ కమర్షియల్ సినిమాలను ఎన్ని అని చేస్తారు అంటూ సినిమా ప్రేక్షకులు కొంతవరకు ఫైర్ అవుతున్నారు…