Hari Hara Veera Mallu- Rajamouli: వకీల్ సాబ్ మరియు భీమ్లా నాయక్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల తర్వాత పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రం ‘హరి హర వీర మల్లు’..కెరీర్ లో ఎన్నడూ లేని విధంగా పవన్ కళ్యాణ్ ఈ సినిమా ద్వారా జానపద జానర్ తో మన ముందుకి రాబోతున్నారు..ఎప్పుడో షూటింగ్ ని ప్రారంబించుకున్న ఈ చిత్రం దాదాపుగా 60 శాతం చిత్రకరణ ని పూర్తి చేసుకుంది..కరోనా లాక్ డౌన్ తర్వాత మళ్ళీ షూటింగ్ ని ప్రారంబించుకున్న ఈ చిత్రం రెండు షెడ్యూల్స్ ని పూర్తి చేసుకుంది..ఆ తర్వాత మళ్ళీ రెండు నెలల పాటు పెద్ద బ్రేక్ రావడం తో ఈ సినిమా షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది అంటూ సోషల్ మీడియా లో ఒక వార్త జోరుగా ప్రచారం సాగింది..ఈ సినిమా సెకండ్ హాఫ్ స్క్రిప్ట్ విషయం లో పవన్ కళ్యాణ్ సంతృప్తి గా లేడని..ఇంకా బలంగా తయారు చేసుకొని రమ్మని క్రిష్ కి చెప్పడం తో కొన్ని రోజుల పాటు ఈ సినిమా షూటింగ్ నిలిచిపోయిందని ఇండస్ట్రీ లో ఒక టాక్ జోరుగా ప్రచారం సాగింది..అయితే అలాంటివి ఏమి లేదు..పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం రాజకీయ కార్యకలాపాలలో ఫుల్ బిజీ గా గడుపుతున్నాడు..ఈ సమయం లో ఆయన మైండ్ ఫ్రీ గా లేదు..ఈ టైం లో షూటింగ్ షెడ్యూల్స్ పెట్టుకుంటే సంపూర్ణంగా మనసు పెట్టలేను అని కొంతకాలం విరామం ఇచ్చినట్టు పవన్ కళ్యాణ్ సన్నిహిత వర్గాలు తెలుపుతున్నాయి.
ఇది ఇలా ఉండగా స్క్రిప్ట్ ని మరింత బలంగా తయారు చేసుకోవడం కోసం డైరెక్టర్ క్రిష్ కి సమయం దొరకడం తో..ఈ సినిమా సెకండ్ హాఫ్ కి సంబంధించిన స్క్రిప్ట్ లో ఏమైనా అవసరమైన మార్పులు చేర్పులు చెయ్యడానికి క్రిష్ దర్శక ధీరుడు రాజమౌళి సహాయం తీసుకుంటున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి..రాజమౌళి కి డైరెక్టర్ క్రిష్ కి మధ్య మంచి సన్నిహిత్య సంబంధం ఉన్న సంగతి మన అందరికి తెలిసిందే..గతం లో క్రిష్ తెరకెక్కించిన గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమా కోసం రాజమౌళి ఒక ప్రత్యేకమైన ఇంటర్వ్యూ కూడా చేసారు..వీళ్లిద్దరి మధ్య ఉన్న ఆ సన్నిహిత్య సంబంధం వల్లే కాస్త చొరవ తీసుకొని క్రిష్ స్క్రిప్ట్ డెవలప్మెంట్ విషయం లో రాజమౌళి సహాయం తీసుకుంటున్నట్టు తెలుస్తుంది.
Also Read: Pooja Hegde: పూజా హెగ్డే వదులుకున్న బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల లిస్ట్ చూస్తే ఆశ్చర్యపోతారు
ఇప్పటి వరుకు ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ హాఫ్ మొత్తం ని పూర్తి చేసారు..అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం..ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అరాచకం గా వచ్చినట్టు తెలుస్తుంది..ముఖ్యం గా ఈ సినిమాలోని పోరాట సన్నివేశాలు ఇప్పటి వరుకు ఇండియన్ చలన చిత్ర పరిశ్రమలో ఎన్నడూ చూడని విధంగా ఉంటుందని తెలుస్తుంది..పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఈ చిత్రం ఒక మైలు రాయిగా నిలిచిపోతుంది..ఇక ఈ సినిమా షూటింగ్ ని పూర్తి చెయ్యడానికి కేవలం ఒక షెడ్యూల్ మాత్రమే మిగిలి ఉందని..పవన్ కళ్యాణ్ గారు దానికి డేట్స్ ఇవ్వగానే షూటింగ్ మొత్తం అక్టోబర్ లోపు పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తుంది..భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న ఈ సినిమా పవన్ కళ్యాణ్ అభిమానులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.