Pooja Hegde: పూజా హెగ్డే వదులుకున్న బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల లిస్ట్ చూస్తే ఆశ్చర్యపోతారు

Pooja Hegde: సౌత్ ఇండియా లో ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న హీరోయిన్ పూజా హెగ్డే అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు..టాలీవుడ్ మరియు కోలీవుడ్ లో మాత్రమే కాకుండా బాలీవుడ్ స్టార్ హీరోలకు కూడా ఇప్పుడు పూజ హెగ్డేనే తమ సినిమాలో హీరోయిన్ గా కావలి అంటూ డిమాండ్ చేస్తున్నారంటే ఆమెకి ఉన్న క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు..తెలుగు లో ఒక లైలా కోసం అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ […]

Written By: Neelambaram, Updated On : July 19, 2022 8:09 am
Follow us on

Pooja Hegde: సౌత్ ఇండియా లో ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న హీరోయిన్ పూజా హెగ్డే అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు..టాలీవుడ్ మరియు కోలీవుడ్ లో మాత్రమే కాకుండా బాలీవుడ్ స్టార్ హీరోలకు కూడా ఇప్పుడు పూజ హెగ్డేనే తమ సినిమాలో హీరోయిన్ గా కావలి అంటూ డిమాండ్ చేస్తున్నారంటే ఆమెకి ఉన్న క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు..తెలుగు లో ఒక లైలా కోసం అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ కి పరిచయమైనా పూజ హెగ్డే, ఆ సినిమా తర్వాత ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలలో నటించి మనం చూస్తూ ఉండగానే పాన్ ఇండియా రేంజ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది..ఇటీవల కాలం లో పూజ హెగ్డే హీరోయిన్ గా నటించిన కొన్ని సినిమాలు భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్స్ అయ్యినప్పటికీ కూడా ఆమె క్రేజ్ మరియు డిమాండ్ ఇసుమంత కూడా తగ్గలేదు..లేటెస్ట్ గా ఆమె ఏకంగా బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ హీరో గా నటిస్తున్న ‘ కభీ ఈద్ కభీ దివాళీ’ అనే సినిమా లో కూడా హీరోయిన్ ఛాన్స్ ని కొట్టేసింది..ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు హైదరాబాద్ లోనే జరుగుతుంది.

Pooja Hegde

ఇది ఇలా ఉండగా పూజ హెగ్డే కొన్ని అనుకోని కారణాల వల్ల మన టాలీవుడ్ లో కొన్ని సినిమాలు మిస్ చేసుకుంది..ఆమె ఎలాంటి సినిమాలు మిస్ చేసుకుందో తెలిసి ఆమె అభిమానులు కాస్త నిరాశకి గురి అవుతున్నారు..ఇంతకీ ఆమె వదులుకున్న ఆ సినిమాలు ఏమిటో ఇప్పుడు మనం ఈ స్టోరీ లో చూడబోతున్నాము..గత ఏడాది కరోనా పీక్ టైం లో విడుదలైన పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చిత్రం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో మన అందరికి తెలిసిందే..సుమారు మూడేళ్లు సుదీర్ఘ విరామం తర్వాత పవన్ కళ్యాణ్ నుండి వచ్చిన ఈ సినిమా ఆయన కెరీర్ లో ఒక మైలు రాయిగా నిలిచిపోయింది..కరోనా కారణంగా థియేటర్స్ లో ఎక్కువ కాలం లేకపోయినప్పటికీ కూడా ఈ సినిమా అన్ని వర్గాలకు వివిధ మాధ్యమాల ద్వారా బాగా రీచ్ అయ్యింది..అయితే ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ లో పవన్ కళ్యాణ్ జోడిగా శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన సంగతి మన అందరికి తెలిసిందే..ఈ పాత్ర కోసం తొలుత పూజ హెగ్డే ని సంప్రదించారట దర్శక నిర్మాతలు..కానీ డేట్స్ సర్దుబాటు కాకపోవడం తో ఆమె ఈ సినిమా నుండి తప్పుకున్నారట.

Also Read: Chiranjeevi Daughter Sreeja: సోషల్ మీడియా లో వైరల్ గా మారిన చిరంజీవి కూతురు శ్రీజ వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్

Pooja Hegde

ఈ సినిమా తో పాటు పూజ హెడ్జ్ వదులుకున్న మరో సినిమా మాస్ట్రో..నితిన్ హీరో గా నటించిన ఈ సినిమాలో నబ్బా నటేష్ హీరోయిన్ గా నటించగా..నెగటివ్ రోల్ లో ప్రముఖ స్టార్ హీరోయిన్ తమ్మన్న నటించింది..అయితే తమన్నా పోషించిన ఆ నెగటివ్ రోల్ కోసం తొలుత పూజ హెగ్డే ని సంప్రదించారట దర్శక నిర్మాతలు..అయితే తనకి ఆ పాత్ర నచినప్పటికీ కూడా కెరీర్ లో ప్రస్తుతం పీక్స్ చూస్తున్న సమయం లో నెగటివ్ రోల్ చేస్తే తన కెరీర్ మీద ప్రభావం చూపిస్తుందని బయపడి ఆమె ఈ రోల్ ని రిజెక్ట్ చేసినట్టు తెలుస్తుంది..ఈ సినిమా తర్వాత ఆమె వదులుకున్న మరో చిత్రం , ప్రస్తుతం సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న శాకుంతలం అనే చిత్రం..ఈ సినిమాని ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు..అయితే తొలుత ఈ సినిమా కోసం పూజ హెగ్డే ని హీరోయిన్ గా తీసుకోవాలని అనుకున్నాడట..కానీ తన దగ్గర లేడీ ఓరియెంటెడ్ సినిమాకి ఇవ్వాల్సినంత డేట్స్ లేకపోవడం తో ఈ సినిమాని కూడా మిస్ చేసుకున్నట్టు తెలుస్తుంది..ఇలా పూజ హెగ్డే తన కెరీర్ లో ఈ సినిమాలను మిస్ చేసుకుంది అంటూ సోషల్ మీడియా లో ఒక వార్త తెగ వైరల్ గా మారిపోయింది.

Also Read:Chiranjeevi – Krishna Vamsi: నేను ఈరోజు ప్రాణాలతో ఉండడానికి కారణం చిరంజీవి గారే – కృష్ణ వంశీ

Tags