Homeఎంటర్టైన్మెంట్Rajamouli Early Career Help: స్టార్టింగ్ లో రాజమౌళి కి డబ్బులిచ్చి సాయం చేసిన స్టార్...

Rajamouli Early Career Help: స్టార్టింగ్ లో రాజమౌళి కి డబ్బులిచ్చి సాయం చేసిన స్టార్ డైరెక్టర్ ఎవరో తెలుసా..?

Rajamouli Early Career Help: సినిమా ఇండస్ట్రీలో ఒక సక్సెస్ ఫుల్ సినిమా చేయడం అనేది అంత ఈజీ కాదు. అలాంటిది చేసిన ప్రతి సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. రాజమౌళి లాంటి దర్శకుడు ఇప్పటివరకు 12 సినిమాలు చేస్తే అందులో 12 కూడా సూపర్ సక్సెస్ లను సాధించడం విశేషం 100% సక్సెస్ రేట్ తో ముందుకు దూసుకెళ్తున్న దర్శకుడు కూడా రాజమౌళినే కావడంతో ఇండియాలో ఉన్న ప్రతి […]

Rajamouli Early Career Help: సినిమా ఇండస్ట్రీలో ఒక సక్సెస్ ఫుల్ సినిమా చేయడం అనేది అంత ఈజీ కాదు. అలాంటిది చేసిన ప్రతి సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. రాజమౌళి లాంటి దర్శకుడు ఇప్పటివరకు 12 సినిమాలు చేస్తే అందులో 12 కూడా సూపర్ సక్సెస్ లను సాధించడం విశేషం 100% సక్సెస్ రేట్ తో ముందుకు దూసుకెళ్తున్న దర్శకుడు కూడా రాజమౌళినే కావడంతో ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క హీరో చూపు ఆయన మీదనే ఉంది… ప్రస్తుతం ఆయన మహేష్ బాబుతో ‘వారణాసి’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే మరో మల్టీస్టారర్ సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. 1300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా 3000 కోట్లకు పైన కలెక్షన్స్ ని కొల్లగొట్టడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతుంది.

Also Read: తెలుగు రాష్ట్రాల్లో ‘ధురంధర్ 2 ‘ కి బయ్యర్స్ కరువు.. కారణం ఏంటంటే!

ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు పాన్ ఇండియాకే పరిమితమయ్యాయి. కానీ ఇప్పుడు చేయబోతున్న సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని అలరించబోతున్నట్టుగా తెలుస్తుంది… రాజమౌళి ప్రస్తుతం ఈ పొజిషన్ లో ఉన్నాడు. కానీ కెరియర్ స్టార్టింగ్ లో ఆయన చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నాడట.

రాఘవేంద్రరావు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసేటప్పుడు రాజమౌళికి చాలా అవసరాలు ఉండేవట. ఎవరిని డబ్బులు అడగాలో తెలియక సతమతమవుతున్న సందర్భంలో రాఘవేంద్రరావు పిలిచి మరీ రాజమౌళికి డబ్బులు ఇచ్చేవారట… అందుకే ఇప్పటికీ రాజమౌళి రాఘవేంద్రరావు గురించి గొప్పగా చెబుతూ ఉంటాడు…అలాగే తన మొదటి సినిమా అయిన ‘స్టూడెంట్ నెంబర్ వన్’ సినిమాకి సైతం రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ చేయడం చాలావరకు హెల్ప్ అయిందట.

ఆయన వల్లే ఆ సినిమా చేయడానికి రాజమౌళికి ఒక అవకాశం అయితే వచ్చింది. మొత్తానికైతే రాజమౌళి ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా తన గురువును ఎప్పటికి మర్చిపోను అని పలు సందర్భాల్లో చెప్పాడు… ప్రస్తుతం రాఘవేందర్రావు సినిమాలేమి చేయకుండా ఖాళీగా ఉంటున్నాడు. రాజమౌళి ఎదుగుదలను చూసి రాఘవేంద్రరావు సైతం చాలా మురిసిపోతున్నాడనే చెప్పాలి…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper