Nidhi Agarwal Movies: అందం,నటన,డ్యాన్స్ ఈ మూడు ఒకే హీరోయిన్ లో ఉండడం చాలా అరుదు. అలాంటి అరుదైన హీరోయిన్స్ లో ఒకరు నిధి అగర్వాల్(Nidhi Agerwal). ఈమె కెరీర్ ని చూసుకుంటే ఒక్క ఇస్మార్ట్ శంకర్ చిత్రం తప్ప మరో సూపర్ హిట్ లేదు. స్టార్ హీరోయిన్ అయ్యేందుకు అన్ని లక్షణాలు ఉన్నప్పటికీ కూడా ఈమెకు ఆవగింజంత అదృష్టం కూడా లేకపోవడం బాధాకరం. చేసిన ప్రతీ సినిమా ఫ్లాప్ అవుతూ వచ్చింది. అలా వరుసగా ఫ్లాప్స్ వస్తున్నప్పటికీ కూడా ఈమెకు పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) తో ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu), ప్రభాస్(Rebel Star Prabhas) తో ‘రాజా సాబ్'(Rajasaab Movie) లాంటి చిత్రాల్లో నటించే అవకాశం దక్కింది. టాలీవుడ్ సూపర్ స్టార్స్ గా పిలవబడే వీళ్లిద్దరి సినిమాల్లో అవకాశాల కోసం పెద్ద పెద్ద స్టార్ హీరోయిన్స్ సైతం ఆతృతగా ఎదురు చూస్తుంటారు, అలాంటిది నిధి అగర్వాల్ కి ఒకేసారి ఇద్దరు సూపర్ స్టార్స్ తో కలిసి నటించే అవకాశం దక్కింది.
ఇక ఆమె జాతకం మారిపోతుందిలే, వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదని చాలా మంది అనుకున్నారు. కానీ ఆమె అదృష్టం ఎలా ఉందంటే ‘హరి హర వీరమల్లు’ చిత్రం మొదలై ఆరేళ్ళు పూర్తి అయ్యాక గత నెలలో విడుదలైంది. సినిమా బాగా పాతబడిపోయింది, ఇలాంటి సినిమాకు టాక్ రాకపోతే ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ అవుతుంది అని అభిమానులకు కూడా ముందే తెలుసు, ఏది అయితే జరగకూడదు అని కోరుకున్నారో, దురదృష్టం కొద్దీ అదే జరిగింది. ప్రీమియర్ షోస్ నుండి ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ టాక్ ని తెచ్చుకుంది. పాపం ఈ చిత్రం మీద నిధి అగర్వాల్ పెట్టుకున్న ఆశలన్నీ గల్లంతు అయ్యాయి. కనీసం సెట్స్ మీదున్న ‘రాజా సాబ్’ చిత్రమైన సమయానికి వస్తుందా అంటే, అది కూడా అయ్యే పనిలా అనిపించడం లేదు. ఈ సినిమా డిసెంబర్ 5న విడుదల అవుతుందని మేకర్స్ ఇప్పటికే అధికారిక ప్రకటన చేశారు.
Also Read: ప్రేయసి తో ఘనంగా రాహుల్ సిప్లిగంజ్ నిశ్చితార్థం..వైరల్ అవుతున్న ఫోటోలు!
కానీ రీసెంట్ గా ఈ చిత్ర నిర్మాత లీగల్ సమస్యలను ఎదురుకోవడం తో డిసెంబర్ లోనే కాదు, జనవరి లో కూడా విడుదల అవ్వడం కష్టమే అని అంటున్నారు. మరో ఆరు నెలలు పొరపాటున ఈ సినిమా వాయిదా పడితే, ఇది కూడా పాతబడిన సినిమా అనే ముద్ర ని వేసుకుంటుంది. అలాంటి ముద్ర పడిన తర్వాత ఒకవేళ సినిమా విడుదలై ఫ్లాప్ టాక్ వస్తే మాత్రం ‘హరి హర వీరమల్లు’ కి పట్టిన గతినే ఈ చిత్రానికి కూడా పడుతుంది. కానీ టాక్ వస్తే మాత్రం వేరే లెవెల్ వసూళ్లను నమోదు చేసుకుంటుంది. ఎంత దురదృష్టం కాకపోతే నిధి అగర్వాల్ నటించిన సినిమాలే ఎలా చిక్కుల్లో పడ్డాయో మీరే చూడండి. ఆమె దురదృష్టం కాస్త అదృష్టం గా మారి ప్రభాస్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందో లేదో చూడాలి.