Rahul Sipligunj Engagement: తెలంగాణ ప్రాంతం నుండి ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ఎన్నో సూపర్ హిట్ పాటలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని, #RRR చిత్రం లోని ‘నాటు నాటు’ పాటతో ఏకంగా ఆస్కార్ అవార్డ్స్ వరకు వెళ్లిన రాహుల్ సిప్లిగంజ్?(Rahul sipligunj) నిన్న హైదరాబాద్ లో తన కుటుంబ సభ్యులు, మిత్రుల సమక్షం లో గ్రాండ్ గా నిశ్చితార్థం చేసుకున్నాడు. అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. పెళ్లి కూతురు పేరు హరిణి రెడ్డి. ఈమె సినీ పరిశ్రమ కు చెందిన వ్యక్తి కాదు, ఆమె బ్యాక్ గ్రౌండ్ వివరాలు కూడా తెలియాల్సి ఉంది. కానీ చూస్తుంటే చాలా అందంగా కనిపిస్తుంది, హీరోయిన్స్ కి ఏ మాత్రం తీసిపోదు అనే చెప్పాలి. త్వరలోనే వీళ్లిద్దరి వివాహం గ్రాండ్ గా హైదరాబాద్ లోనే జరగనుంది. ఈ పెళ్లి వేడుకకు సీఎం రేవంత్ రెడ్డి కూడా విచ్చేస్తాడని తెలుస్తుంది.
ఇదంతా పక్కన పెడితే రాహుల్ బిగ్ బాస్ సీజన్ 3 టైటిల్ విన్నర్ అనే విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సీజన్ లో ఆయన పునర్నవి భూపాళం అనే కంటెస్టెంట్ తో లవ్ ట్రాక్ నడిపాడు. నిజంగానే వీళ్లిద్దరు ఈ లవ్ ట్రాక్ ని బయట కూడా కొనసాగిస్తారేమో అని అంతా అనుకున్నారు, కానీ బయటకు వచ్చిన తర్వాత రాహుల్ ఎక్కువగా అషు రెడ్డి తో తిరుగుతూ కనిపించాడు. కానీ వీళ్లిద్దరు కాదు, ఆయన నిజ జీవితం లో ఎక్కువ కాలం ప్రేయసి గా ఉన్నది రతిక. ఈమె బిగ్ బాస్ సీజన్ 7 లో ఒక కంటెస్టెంట్ గా పాల్గొన్న సంగతి తెలిసిందే. చాలా కాలం వరకు ఈమెతో ప్రేమాయణం నడిపాడు రాహుల్. ఆ తర్వాత కొన్ని అనుకోని కారణాల వల్ల వీళ్లిద్దరు విడిపోవాల్సి వచ్చింది. బిగ్ బాస్ 7 లో రతిక అతన్ని తలచుకొని బాధపడడం కూడా మనమంతా చూశాము.
Also Read: అక్షరాలా 397 కోట్లు..4 రోజుల్లో చరిత్ర సృష్టించిన ‘కూలీ’.. బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే!
ఇక వీళ్లిద్దరు కలిసి తిరిగిన ఫోటోలు సోషల్ మీడియా లో ఇప్పటికీ తిరుగుతూనే ఉన్నాయి. అలా రాహుల్ జీవితం ఎన్నో మలుపులు తీసుకొని, చివరికి హరిణి రెడ్డి అనే అమ్మాయి వద్ద లాక్ అయ్యింది. బిగ్ బాస్ తర్వాత వచ్చిన పాపులారిటీ తో బయటకు వచ్చిన తర్వాత పెద్ద స్థాయికి వెళ్లిన కంటెస్టెంట్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. ఆ తక్కువ మందిలో కచ్చితంగా రాహుల్ పేరు ఉంటుంది. హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత ఎన్నో సూపర్ హిట్ పాటలకు రాహుల్ తన గాత్రం అందించాడు. ముఖ్యంగా తెలంగాణ జానపదం పాటలు పాడడం లో రాహుల్ దిట్ట. మొన్న గద్దర్ అవార్డ్స్ లో రాహుల్ సిప్లిగంజ్ పేరు ని చేర్చడం లో జ్యూరీ సభ్యులు మర్చిపోవడం సీఎం రేవంత్ రెడ్డి దానిని గుర్తుపెట్టుకొని మరీ రాహుల్ కి ప్రత్యేకంగా సత్కారం చేసిన సంగతి తెలిసిందే. అలా ఇటీవల కాలం లో ఆయన పేరు గట్టిగానే ట్రెండ్ అయ్యింది.