https://oktelugu.com/

Raj Tarun: బ్యాడ్ టైంలో గొప్ప అవకాశం.. ఫామ్ లోకి వస్తాడా ?

Raj Tarun: రాజ్ తరుణ్ కెరీర్ లో చాలా స్పీడ్ గా ఎదిగాడు, ప్రస్తుతం అంతే స్పీడ్ గా కెరీర్ పడిపోయింది అనుకోండి. ఐదేళ్ల క్రితం రాజ్ తరుణ్ దగ్గర ఎప్పుడూ ఇద్దరు ముగ్గురు నిర్మాతల అడ్వాన్స్ లు ఉండేవి. ఆ స్థాయిలో అతనికి డిమాండ్ ఉండేది అప్పుడు. ఇప్పుడు ఎంత ఇచ్చినా సినిమా చేస్తాను అని రాజ్ తరుణ్ ఆఫర్ ఇచ్చినా నిర్మాత లేడు. ఒకప్పుడు వరుసగా సినిమాలు చేయమని రాజ్ తరుణ్ ను బుక్ […]

Written By:
  • Shiva
  • , Updated On : March 28, 2022 / 07:08 PM IST
    Follow us on

    Raj Tarun: రాజ్ తరుణ్ కెరీర్ లో చాలా స్పీడ్ గా ఎదిగాడు, ప్రస్తుతం అంతే స్పీడ్ గా కెరీర్ పడిపోయింది అనుకోండి. ఐదేళ్ల క్రితం రాజ్ తరుణ్ దగ్గర ఎప్పుడూ ఇద్దరు ముగ్గురు నిర్మాతల అడ్వాన్స్ లు ఉండేవి. ఆ స్థాయిలో అతనికి డిమాండ్ ఉండేది అప్పుడు. ఇప్పుడు ఎంత ఇచ్చినా సినిమా చేస్తాను అని రాజ్ తరుణ్ ఆఫర్ ఇచ్చినా నిర్మాత లేడు. ఒకప్పుడు వరుసగా సినిమాలు చేయమని రాజ్ తరుణ్ ను బుక్ చేసుకునేవాళ్ళు.

    Raj Tarun

    కానీ, ఇప్పుడు రాజ్ తరుణ్ తో సినిమా చేయడానికి ఎవ్వరూ కనీస ఇంట్రెస్ట్ కూడా చూపించడం లేదు. ఇలాంటి స్థితిలో ఉన్న రాజ్ తరుణ్ కి ఓ బంపర్ ఆఫర్ తగిలింది. మాస్ మహా రాజా రవితేజ నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో రాబోతున్న కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ధమాకాలో ఓ కీలక పాత్ర ఉంది. అయితే, ఆ పాత్రలో రాజ్ తరుణ్ నటించబోతున్నాడు.

    Also Read: Kejriwal Kodandaram: ఆప్ పార్టీలో టీజేఎస్ విలీనం..? కోదండ‌రాంతో కేజ్రీవాల్‌కు ఒరిగేదేంటి..?

    నటిస్తే.. రాజ్ తరుణ్ కెరీర్ కి ఇది చాలా ప్లస్ అవుతుంది. ఎందుకంటే ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి. పైగా ఈ సినిమా పక్కా ఎంటర్ టైనర్ మూవీ. అన్నిటికీ మించి హీరో రవితేజ. కాబట్టి.. రాజ్ తరుణ్ కి ఇది మంచి అవకాశం. మళ్ళీ ఫామ్ లోకి రావడానికి ఇది బాగా ఉపయోగించుకోవచ్చు. మరి రాజ్ తరుణ్ ఈ ఛాన్స్ ను ఎలా వాడుకుంటాడో చూడాలి.

    నిజానికి ఆరేళ్ళ క్రితం రాజ్ తరుణ్ కి ఒక డైరెక్టర్ వెళ్లి కథ చెప్పడానికి చాలా కష్టపడాల్సి వచ్చేది. అంతగా రాజ్ తరుణ్ కి అప్పుడు డిమాండ్ ఉండేది. పైగా ఓ దశలో రాజ్ తరుణ్ కి వరుస హ్యాట్రిక్ హిట్స్ కూడా పడ్డాయి. దాంతో రాజ్ తరుణ్ రేంజ్ బాగా పెరిగింది.

    సడెన్ గా లైమ్ లైట్ లోకి వచ్చాడు. అయితే అదృష్టం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా. రాజ్ తరుణ్ ప్రస్తుతం బ్యాడ్ టైంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. మరి రవితేజ అయినా హిట్ ఇస్తాడా ? చూడాలి.

    Also Read: Puri Jagannadh Latest Update: బిగ్ అప్ డేట్ కి ఇంకా 14:20 గంటల సమయం ఉంది !

    Recommended Video:

    Tags