Yadadri Temple: యాదాద్రి లక్ష్మినరసింహ స్వామి ఆలయంలో మహాక్రతువు నిర్వహిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆలయాన్ని పునర్మిస్తున్నారు. క్షేత్రానికి అన్ని హంగులు దిద్దారు. సర్వాంగ సుందరంగా అలంకరించారు. దీనికి ముఖ్యమంత్రితో పాటు పలువురు నేతలు హాజరై బాలాలయం నుంచి స్వామి వారిని ఆలయం చుట్టూ తిప్పుతున్నారు. పర్యాటకులకు కనువిందు చేసే విధంగా ఆలయాన్ని తీర్చిదిద్దారు. శిల్ప కళావైభవం చూస్తుంటే అబ్బురపరుస్తుంది. దీంతో యాదాద్రి క్షేత్రాన్ని దివ్యధామంగా చేశారు.
యాదాద్రిలో లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రంలో పనులు పూర్తి కావచ్చాయి. బాలాలయం నుంచి దేవతామూర్తులను ఆలయంలోకి చేర్చే క్రతువును సోమవారం నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ , ఆయన సతీమణి తదితరులు పాల్గొన్న కార్యక్రమం కనుల పండువగా సాగింది. వేదమంత్రోచ్ఛారణల మధ్య దేవతా మూర్తులను ఊరేగించారు. ఈ సందర్భంగా తొలి దర్శనం సీఎం కేసీఆర్ దంపతులకే దక్కడం విశేషం. అనంతరం భక్తులకు దర్శనం లభించింది.
Also Read: 40 Years For TDP: టీడీపీ @40 ఇయర్స్.. తమ్ముళ్ల ఆవేదన పట్టించుకోండయ్యా చంద్రబాబు..
సీఎం తోపాటు ప్రముఖులు రావడంతో భద్రత కట్టుదిట్టం చేశారు. ఆలయ పరిసరాలన్ని సీసీ కెమెరాలతో వీక్షించారు. ప్రతి ద్వారం దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో యాదాద్రి పుణీతమైంది. ఆలయమంతా సందడిగా మారింది. ఎటు చూసినా స్వామి వారి మంత్రాలే వినిపించాయి. సీఎం కేసీఆర్ యాదాద్రి ఆలయంపై ప్రత్యేక శ్రద్ధ కనబరచారు. దీంతో ఆలయ నిర్మాణం వేగవంతంగా పూర్తి చేయడం విశేషం.
ఆదివారం మహాయాగ క్రతువు, ప్రధానాలయంలో కలశాభిషేకం, షోడశ కళాన్యాస హోమం, పంశయ్యాధివాసం నిర్వహించారు. పవిత్ర జలాలు, పంచామృతం, సుగంధ ద్రవ్యాలు నింపి సుదర్శన చక్రం, పెరుమాళ్లు, గోదాదేవి, గరుడ విష్యక్సేన, ప్రతిష్టామూర్తుల అభిషేకం తదితర కార్యక్రమాలు చేపట్టారు. యాదాద్రి ఆలయానికి విశిష్ట గుర్తింపు రానుంది. ఇప్పటికే ఆలయ ప్రాశస్త్యంపై ఎంతో ప్రచారం జరిగింది.