Homeఎంటర్టైన్మెంట్Lakshmi Rai: ధోనీతో బ్రేకప్​పై నటి లక్ష్మీ రాయ్​ ఆసక్తికర వ్యాఖ్యలు

Lakshmi Rai: ధోనీతో బ్రేకప్​పై నటి లక్ష్మీ రాయ్​ ఆసక్తికర వ్యాఖ్యలు

Lakshmi Rai: ప్రముఖ టీమ్​ఇండియా మాజీ కెప్టెన్​, క్రికెటర్​ మహేంద్ర సింగ్ ధోనీ.. చాలా విషయాల్లో యంగ్​ క్రికెటర్లకు ఆయన ఆదర్శంగా నిలుస్తారు. కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న ధోనీ.. క్రికెట్​కు గుడ్​బై చెప్పి.. జట్టుకు తనదైన స్టైల్​లో సేవలందిస్తున్నారు. ప్రస్తుతం టీమ్​ఇండియా మెంటార్​గా వ్యవహరిస్తున్న మహీ.. జట్టుకు ఓ టార్చ్ బేరర్​గా నిలుస్తున్నారు. అయితే, ధోని క్రికెట్ మొదలుపెట్టిన తొలినాళ్లలో కొన్ని లవ్​ ట్రాక్​లు నడిచినట్లు గతంలో పలు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే నటి లక్ష్మీ రాయ్​ పేరు కూడా వినిపించింది.

Lakshmi Rai
Lakshmi Rai

అయితే, తాజాగా, ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన లక్ష్మీరాయ్​.. ధోనీతో తన ప్రేమ వ్యవహారం, వైఫల్యం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. అసలు వారిద్దరు ఎందుకు విడిపోవాల్సి వచ్చిందన్న విషయంపై ఆమె క్లారిటీ ఇచ్చింది.

తెలుగు, తమిళ పరిశ్రమలో లక్ష్మీరాయ్​ మంచి హీరోయిన్​గా పేరు తెచ్చుకుంది. 2008 ఐపీఎల్​లో చెన్నై సూపర్​ కింగ్స్​కు ధోనీ కెప్టెన్​గా ఉన్న సమయంలోనే వీరిద్దరూ డేటింగ్​లో ఉన్నట్లు లక్ష్మీ తెలిపింది. ఐపీఎల్​ మ్యాచ్​ల అనంతరం జరిగే పార్టీలకు ధోనీతోనే కలిసి లక్ష్మీ హాజరైనట్లు అప్పట్లో వార్తలు కూడా వినిపించాయి. అయితే, 2008 నుంచి 2009 వరకు వారి డేటింగ్ కొనసాగినట్లు చెబుతారు. రాయ్ లక్ష్మీ‌తో ఎంఎస్ ధోని డేటింగ్ వ్యవహారం అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. వారి రిలేషన్ పెళ్లి వరకు వెళ్లిందన్న టాక్ కూడా వినిపించింది. అయితే  సడన్​గా ధోని,లక్ష్మీ  ఏడాదిలోపే బ్రేకప్ చెప్పుకోవడం అందర్నీ షాక్​కు గురిచేసింది.

Also Read: మోస్ట్ సెర్చ్డ్ ఫిమేల్ సెలబ్రిటీగా సమంత … టాప్ 10 లిస్ట్ చోటు కైవసం

Lakshmi Rai
MS Dhoni

ఈ విషయంపై స్పందిస్తూ.. తామిద్దరూ సామరస్యంగానే విడిపోయినట్లు తెలిపింది. ఎటువంటి గొడవలు లేకుండా బ్రేక్​అప్ చెప్పుకున్నట్లు వెల్లడించింది. ఆ తర్వాత కూడా ఒకరిపై ఒకరికి రెస్పెక్ట్ పెరిగిందని పేర్కొంది లక్ష్మీ. ధోనీ తర్వాత తన జీవితంలో చాలా బ్రేకప్​లు అయ్యాయని.. కానీ తానెప్పుడూ బాధపడలేదని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తన కెరీర్​పై పూర్తి దృష్టి పెట్టినట్లు స్పష్టం చేసింది.

Also Read: శ్రీదేవిని కమల్ హాసన్ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఇదేనా..?

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular