Deepika: బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయింది. ఈ క్రమంలోనే అనేక ప్రాంతాలకు షూటింగ్ నిమిత్తం వరుస ప్రయాణాలు చేయాల్సి వస్తోంది. తాజాగా దీపికా హైదరాబాద్ వెళ్తుండగా.. ముంబయి విమానాశ్రయంలో కనిపించింది. ఈ ప్రయాణం ఓ షూట్ కోసమని తెలుస్తోంది. ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తోన్న సినిమా ప్రాజెక్ట్ కె. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ కూడా నటించనున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఈ సినిమా షూటింగ్ కోసమే దీపికా హైదరాబాద్ వచ్చినట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాతో దీపికా టాలీవుడ్లో అరంగేట్రం చేయనుంది. అయితే, ఈ సినిమాకు తాత్కాలికంగానే ప్రాజెక్ట్ కె అని టైటిల్ పెట్టారు. వైజయంతీ మూవీస్ ఈ సినిమాను భారీ బడ్దెట్తో నిర్మిస్తోంది. కాదా, 2022లో ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల చేయనున్నారు. ప్రముఖ చిత్ర దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఈ బృందానికి మెంటార్‌గా వ్యవహరించనున్నారు.
Also Read: క్రికెటర్ మిథాలీ రాజ్ బయోపిక్ లో తాప్సీ… ‘శభాష్ మిథూ’ రిలీజ్ ఎప్పుడంటే ?
కాగా, ఈ సంవత్సరం ప్రారంభంలోనే అమితాబ్‌తో ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించారు. ఈ సినమాలో బిగ్‌బీ పాత్ర గురించి అశ్విన్ ఒకానొక సందర్భంలో మాట్లాడుతూ.. బచ్చన్ సర్ మా సినిమాలో నటించడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు.
మరోవైపు రాధేశ్యామ్ సినిమాతో ఫుల్ బిజీగా ఉన్న ప్రభాస్.. ఆ సినిమాతో పాటు సలార్, ఆదిపురుష్ చిత్రాల్లో కూడా నటిస్తున్నారు. ప్రస్తుతం ఆదిపురుష్ సినిమా షూటింగ్ పూర్తికాగా.. సలార్ కొనసాగుతోంది.
Also Read: మోస్ట్ సెర్చ్డ్ ఫిమేల్ సెలబ్రిటీగా సమంత … టాప్ 10 లిస్ట్ చోటు కైవసం
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Deepika padukone begins shooting prabhas new movie
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com