Rahul Sipligunj- Rathika Rose: రాహుల్ సిప్లిగంజ్ కంటెస్టెంట్ రతికా రోజ్ కి భారీ షాక్ ఇచ్చాడు. తన పేరు చెప్పుకుని ఫేక్ సింపథీ గేమ్స్ ఆడుతుందని పరోక్షంగా ఆరోపించాడు. బిగ్ బాస్ షో చిన్న విషయం కాదు. కొందరు కంటెస్టెంట్స్ చాలా ప్రీ ప్లాన్స్ తో హౌస్లో అడుగుపెడతారు. హౌస్లో మనం ఎలా ఉండాలి? దాన్ని బయట ఉన్న పీఆర్ టీం ఎలా ఎలివేట్ చేయాలి. జనాల్లో సింపథీ, ఫేమ్ తెచ్చుకోవాలనేది ముందుగానే అనుకుంటారు. పీఆర్ టీమ్ లేకుండా బిగ్ బాస్ హౌస్లో రాణించలేమనే వాదన ఉంది. ఇక సీజన్ 7లో రతికా రోజ్ వెరీ డేంజరస్ కంటెస్టెంట్. ప్రతి చోటా తన మార్క్ ఉండాలనే తాపత్రయం.
ఫస్ట్ డే నుండే తన దగ్గరున్న ఒక్కో అస్త్రం బయటపెట్టడం స్టార్ట్ చేసింది. ఎవరినైనా బాగా మిస్ అవుతున్నారా? అని బిగ్ బాస్ అడిగారు. పేరెంట్స్ కంటే కూడా ఒక వ్యక్తిని బాగా మిస్ అవుతున్నా అంటూ కన్నీరు పెట్టుకుంది. ఈ విషయాన్ని రతికా నియమించుకున్న పీఆర్ టీమ్స్ హైలెట్ చేశాయి. రతికా సింగర్ రాహుల్ సిప్లిగంజ్ మాజీ లవర్. అతన్ని తలచుకునే ఆమె బాధపడిందని కథనాలు రాయించారు. ఫోటోలు తీసి ప్రచారం చేశారు. రతికా రోజ్ పేరు మారుమ్రోగింది. హౌస్లో ఆమె పెట్టుకునే రిలేషన్స్ కూడా హానెస్ట్ గా లేవు.
ఈ క్రమంలో రతికా రోజ్ కి రాహుల్ సిప్లిగంజ్ భారీ షాక్ ఇచ్చాడు. ఆమె పేరు ప్రస్తావించకుండా తీవ్ర ఆరోపణలు చేశాడు. ”ఫేక్ సింపథీ గేమ్ ఎప్పటి వరకు? మనుషులు నిరంతరం తమలోని టాలెంట్ నిరూపించుకునేందుకు ప్రయత్నం చేస్తుంటారు. కొందరు మాత్రం ఇతరుల ఫేమ్, నేమ్ మీద ఆధారపడతారు. ఈ విషయాన్ని కొందరు తమ చర్యలతో నిరూపిస్తారు కూడాను. ఫేమ్ కోసం అవసరాని కంటే ఎక్కువ వాడుకుంటున్నారు. నీ లోపల ఉన్న మనిషికి ఆల్ ది బెస్ట్. అలాగే పైసలు తీసుకున్న టీమ్ కి కంగ్రాట్స్…” అని సోషల్ మీడియా పోస్ట్ పెట్టాడు.
తన మాజీ లవర్ గా హౌస్లో హింట్స్ ఇస్తూ రతికా రోజ్ సింపథీ గేమ్స్ ఆడుతుందని. దాన్ని ఆమె డబ్బులు ఇచ్చి నియమించుకున్న పీఆర్ టీమ్స్ ఎలివేట్ చేస్తున్నాయని రాహుల్ ఇండైరెక్ట్ గా చెప్పాడు. చీప్ ట్రిక్స్ పై అసహనం వ్యక్తం చేశాడు. మనలోని టాలెంట్ చూపి షోలో గెలవాలి. ప్రేక్షకుల ఆదరణ పొందాలి. అంతే కానీ ఫేక్ సింపథీ గేమ్స్ తో కాదని రాహుల్ సిప్లిగంజ్ ఎక్కడ చెప్పాడు. రాహుల్ పోస్ట్ వైరల్ అవుతుంది. కాగా రాహుల్ సిప్లిగంజ్ సీజన్ 3 టైటిల్ విన్నర్ అన్న విషయం తెలిసిందే…
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
Read More