Ashureddy reveals love affair
Ashu Reddy : టిక్ టాక్ వీడియోలతో ఫేమస్ అయిన అషురెడ్డి.. బిగ్ బాస్ షోలో పాల్గొని మరింత ఫేమ్ రాబట్టింది. నాగార్జున హోస్ట్ చేసిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 3లో అషురెడ్డి కంటెస్ట్ చేసింది. టిక్ టాక్ వీడియోలు చేసే అషురెడ్డి జూనియర్ సమంత అనే పేరు తెచ్చుకుంది. సోషల్ మీడియా స్టార్ హోదాలో ఆమెకు బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ దక్కింది. అనంతరం పలు టెలివిజన్ షోలలో సందడి చేసింది. ఇంస్టాగ్రామ్ లో హాట్ అండ్ గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తూ అషురెడ్డి వార్తల్లో నిలుస్తుంది. కొన్ని సార్లు ఆమె హద్దులు దాటేస్తుంది. ఈ క్రమంలో ట్రోల్స్ ఎదురవుతూ ఉంటాయి. అయితే అవేమీ అషురెడ్డి పట్టించుకోదు.
Also Read : అల్లు అర్జున్ కి జంటగా గ్లోబల్ బ్యూటీ, అట్లీ మూవీపై మైండ్ బ్లోయింగ్ అప్డేట్!
చూసే మీ కళ్ళలోనే తప్పు ఉంది. నా డ్రెస్సింగ్ లో కాదంటూ కౌంటర్లు ఇస్తుంది. అలాగే అషురెడ్డి మీద తరచుగా ఎఫైర్ రూమర్స్ వస్తుంటాయి. అయితే పరోక్షంగా తన రిలేషన్ బయటపెట్టింది అషురెడ్డి. సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తన ప్రియుడని తేల్చేసింది. వీరిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అనే పుకారు చాలా కాలంగా ఉంది. అషురెడ్డి తాజా కామెంట్స్ తో దీనిపై క్లారిటీ వచ్చింది. లేటెస్ట్ ఇంటర్వ్యూలో అషురెడ్డి మాట్లాడుతూ.. అమెరికాలో జాబ్ చేస్తుండగా ఛల్ మోహనరంగా మూవీలో ఛాన్స్ వచ్చింది. నితిన్ హీరో, పవన్ కళ్యాణ్ ప్రొడ్యూసర్ అనగానే వెంటనే ఒప్పేసుకున్నాను.
పాత్ర నిడివి ఎంత, ప్రాధాన్యత వుందా లేదా? అనే విషయాలు పట్టించుకోలేదు. అయితే సినిమా ఇండస్ట్రీలోకి రావడానికి మా పేరెంట్స్ ఒప్పుకోలేదు. నా చెల్లి పేరెంట్స్ ని ఒప్పించింది. అప్పుడు బిగ్ బాస్ షోలో ఆఫర్ వచ్చింది. బిగ్ బాస్ హౌస్లో రాహుల్ పరిచయం అయ్యాడు. రాహుల్ చాలా సిగ్గరి. బిడియంగా ఉంటాడు. మేము చాలా సార్లు హ్యాంగ్ అవుట్ అయ్యాము. ఒకసారి దుబాయ్ లో ఇద్దరం కలిశాము. రాహుల్ ఫ్యామిలీతో కూడా నాకు అనుబంధం ఉంది. మా ఇద్దరి కుటుంబాల మధ్య సాన్నిహిత్యం ఉంది. రాహుల్, నేను వేరు కాదనేంతగా మా మధ్య బాండింగ్ ఉంది. మా రిలేషన్ పై ఫ్యామిలీ మెంబర్స్ అధికారిక ప్రకటన చేస్తారు. అంతకంటే నేను ఇప్పుడు ఏమీ చెప్పలేను, అన్నారు.
అషురెడ్డి మాటలు పరిశీలిస్తే అతడే తన ప్రియుడు. పేరెంట్స్ అంగీకారం కూడా ఉంది. త్వరలో పెళ్లి పై అధికారిక ప్రకటన ఉంటుందని అర్థం అవుతుంది. ఈ క్రమంలో రాహుల్-అషురెడ్డి వివాహం అంటూ కథనాలు వెలువడుతున్నాయి.
Also Read : గృహ హింస కేసు.. హై కోర్టుకు హాజరైన హీరోయిన్ హన్సిక!
Web Title: Ashu reddy ashureddy reveals love affair