దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో రాబోతున్న అత్యున్నత భారీ మల్టీస్టారర్ ‘రౌద్రం రణం రుధిరం’ సినిమాలో రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కి ఫ్రెండ్ రోల్ లో నటించబోతున్నాడు. ఇప్పటికే రాహుల్ షూటింగ్ లో కూడా పాల్గొన్నాడు. ఎన్టీఆర్ కి ఫ్రెండ్ అంటే.. రాహుల్ ది ట్రైబ్ క్యారెక్టరే. పైగా ఎక్కువ సీన్స్ లో కనిపిస్తాడట. ప్రస్తుతం రాహుల్ తన పాత్రకు డబ్బింగ్ చెబుతున్నాడట. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే.
ధృడంగా ఉండే కొమరం భీం రోల్ కోసం ఎన్టీఆర్ కఠినమైన కసరత్తులు కూడా చేశాడు. అయితే తారక్ ఫస్ట్ లుక్ వీడియో ఎప్పుడు రిలీజ్ అవుతుందో ? ఆ వీడియోలో ఎన్టీఆర్ ఎలా కనిపించబోతున్నాడు ? అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
కాగా ‘బాహుబలి’ తరవాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడంతోపైగా ఇద్దరు స్టార్ హీరోలు కలిసి మొదటిసారి నటిస్తుండటంతో ఈ మల్టీస్టారర్ పై ఆరంభం నుండి భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి.