https://oktelugu.com/

మనోజ్ కి పాన్ ఇండియా సెట్ అవుతుందా ?

టాలీవుడ్ స్టార్ హీరోలందరీ మెయిన్ టార్గెట్ ప్రస్తుతం పాన్ ఇండియా మూవీనే. ఒక్క మహేష్ బాబు తప్ప మిగిలిన టాప్ హీరోలు ఇప్పటికే పాన్ తో తమ స్పాన్ పెంచుకుని పాన్ ఇండియా స్టార్ గా కొనసాగాలని ప్రయత్నాలు మొదలెట్టేశారు. బన్నీ పుష్పతో పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. అయితే స్టార్ హీరోలతో పాటు మంచు మనోజ్, విజయ్ దేవరకొండ లాంటి హీరోలు కూడా పాన్ ఇండియా మూవీస్ చేస్తుండం విశేషం చాల గ్యాప్ ఇచ్చి ఎట్టకేలకు […]

Written By: , Updated On : June 15, 2020 / 09:28 AM IST
Follow us on


టాలీవుడ్ స్టార్ హీరోలందరీ మెయిన్ టార్గెట్ ప్రస్తుతం పాన్ ఇండియా మూవీనే. ఒక్క మహేష్ బాబు తప్ప మిగిలిన టాప్ హీరోలు ఇప్పటికే పాన్ తో తమ స్పాన్ పెంచుకుని పాన్ ఇండియా స్టార్ గా కొనసాగాలని ప్రయత్నాలు మొదలెట్టేశారు. బన్నీ పుష్పతో పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. అయితే స్టార్ హీరోలతో పాటు మంచు మనోజ్, విజయ్ దేవరకొండ లాంటి హీరోలు కూడా పాన్ ఇండియా మూవీస్ చేస్తుండం విశేషం చాల గ్యాప్ ఇచ్చి ఎట్టకేలకు మళ్లీ ‘అహం బ్రహ్మాస్మి’తో మళ్ళీ సినిమాల్లో యాక్టివ్ కాయబోతున్న మంచు మనోజ్.

‘అహం బ్రహ్మాస్మి’ సినిమాని పాన్ ఇండియా మూవీగానే తీసుకువస్తున్నాడు. ఎప్పుడూ కొత్తదనం కోసం వైవిధ్యమైన కథలతో సినిమాలు చేసే మంచు మనోజ్.. ఈ సారి ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో పాన్ ఇండియా హిట్ కొడతాడా అనేదే ప్రశ్న. అయితే ‘అహం బ్రహ్మాస్మి’ అనే గొప్ప స్లోగన్ ఆధారంగా నడిచే కథ కావడం, మనోజ్ సెకెండ్ ఇనింగ్స్ లో పవర్ ఫుల్ రీఎంట్రీ ఇస్తుండటంతో.. ఈ సినిమా పై మంచి అంచనాలే ఉన్నాయి. అది ఎంతవరకూ వర్కౌట్ అవుతుందో చూడాలి.

ఇక ఇండస్ట్రీలో కొత్త టాలెంట్‌ ను ఎంకరేజ్‌ చేయాలని ‘ఎమ్ఎమ్‌ ఆర్ట్స్‌’ పేరుతో మంచు మనోజ్ సొంత నిర్మాణ సంస్థను కూడా ప్రారంభించాడు. దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా ఎమ్ ఎమ్ ఆర్ట్స్ పతాకం పై మంచు ఫ్యామిలీ స్వయంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మంచి కోసం పోరాడే మనోజ్ కి ఈ సినిమాతోనైనా మంచి జరగాలని కోరుకుందాం.