https://oktelugu.com/

Puneeth Rajkumar: పునీత్ మరణం ఒక ప్రశ్నలా మిగిలింది అంటున్న రాఘవేంద్ర రాజ్ కుమార్…

Puneeth Rajkumar : కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఒక నటుడిగా మాత్రమే కాకుండా ఒక మంచి మనసున్న వ్యక్తిగా ఎంతోమంది మనసు గెలుచుకున్నారు.ఇలా అతి చిన్న వయసులోనే విశేషమైన ఆదరణ దక్కించుకున్న పునీత్ మరణం తీరని లోటుగానే చెప్పుకోవాలి. పునీత్‌ ఈ లోకాన్ని విడిచిపోయి 30 రోజులు గడిచిపోయాయి. అయినా ఆయన చనిపోయాడన్న విషయాన్ని వారి కుటుంబ సభ్యులు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. Also Read: Sirivennela Seetha Rama Sastri: ప్రముఖ కవి, […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 30, 2021 / 06:42 PM IST
    Follow us on

    Puneeth Rajkumar : కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఒక నటుడిగా మాత్రమే కాకుండా ఒక మంచి మనసున్న వ్యక్తిగా ఎంతోమంది మనసు గెలుచుకున్నారు.ఇలా అతి చిన్న వయసులోనే విశేషమైన ఆదరణ దక్కించుకున్న పునీత్ మరణం తీరని లోటుగానే చెప్పుకోవాలి. పునీత్‌ ఈ లోకాన్ని విడిచిపోయి 30 రోజులు గడిచిపోయాయి. అయినా ఆయన చనిపోయాడన్న విషయాన్ని వారి కుటుంబ సభ్యులు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

    raghavendra raj kumar emotional about puneeth raj kumar

    Also Read: Sirivennela Seetha Rama Sastri: ప్రముఖ కవి, గేయ రచయిత సిరివెన్నెల మృతిపై స్పందించిన… సీఎం జగన్

    అప్పు మరణించి నెల రోజులు కావడంతో ఆయన కుటుంబ సభ్యులు సోమవారం కంఠీరవ స్డూడియోలో పునీత్‌ సమాధికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అన్న శివరాజ్‌కుమార్, భార్య గీతా, మరో అన్న రాఘవేంద్ర, పునీత్‌ భార్య అశ్విని తదితరులు పూజల్లో పాల్గొని పునీత్‌కు నివాళి అర్పించారు.ఈ సందర్భంగా రాఘవేంద్ర సోదరుడిని గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. పూజ అనంతరం రాఘవేంద్ర విలేకరులతో మాట్లాడుతూ పునీత్‌కు కార్లు, కోట్ల డబ్బులున్నప్పటికీ ఐదు నిమిషాల సమయం దొరకలేదని ఆనాటి ఘటనను గుర్తు చేసుకొని భావోద్వేగానికి గురయ్యారు. అలానే ఇటీవల శివరాజ్‌కుమార్‌ కూడా ఇలాగే ఎమోషనల్‌ అయ్యారు. తమ్ముడి మరణాన్ని ఇప్పటికీ నేనింకా జీర్ణించుకో లేకపోతున్నాను. అప్పూ నా పక్కనే ఉన్నట్టు అనిపిస్తోంది. ‘శివన్న’ అని ప్రేమగా పిలుస్తున్నట్టు వినిపిస్తోంది. ఈ నెల రోజులు ఎలా గడిచిపోయాయో కూడా నాకు అర్థం కావడం లేదు అని పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. పునీత్ రాజ్ కుమార్‏కు కర్ణాటక రత్న అవార్డు ఇవ్వనున్నట్లుగా కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై కొద్దిరోజుల క్రితం ప్రకటించారు. ప్రస్తుతం రాఘవేంద్ర రాజ్ కుమార్ చేసిన పోస్ట్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

    Also Read: Sirivennela Seetharama Sastri: దివికేగిన దిగ్గజం సిరివెన్నెలకు తుదినివాళులు అర్పిస్తున్న సినీ ప్రముఖులు…