Actress Lavanya Tripathi: అందాల రాక్షసి సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది హీరోయిన్ లావణ్య త్రిపాఠి. తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో మంచి గుర్తింపు సాధించింది. లావణ్యకు భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయనా చిత్రాల ద్వారా మంచి గుర్తింపు వచ్చింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే లావణ్య అభిమానులతో టచ్ లో ఉంటుంది. ఇప్పుడు ప్రేక్షకులను నవ్వించడానికి రెడీ అవుతున్నారు ఈ భామ. ఇప్పటి వరకు లావణ్యా త్రిపాఠి ప్రేమకథా చిత్రాల్లో, కమర్షియల్ ఎంటర్టైనర్స్ లో నటించారు అలానే ‘చావు కబురు చల్లగా’ వంటి డిఫరెంట్ సినిమాలో కూడా కనిపించారు. కానీ మొదటిసారి ఓ క్రైమ్ కామెడీ సినిమా చేసేందుకు రెడీ అయ్యింది లావణ్య.
actress lavanya tripathi doing new movie under mythri movie makers
Also Read: Sirivennela Seetharama Sastri: చిత్ర పరిశ్రమలో విషాదం… దిగ్గజ గేయ రచయిత సిరివెన్నెల మృతి
రితేష్ రాణాతో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఓ సినిమా ప్రొడ్యూస్ చేస్తోంది. అందులో లావణ్యా త్రిపాఠి హీరోయిన్ గా ఎంపికైనట్లు సమాచారం. కాగా ఈ మూవీ లో హీరో ఎవరనేది త్వరలో వెల్లడి కానుంది. క్రైమ్ కామెడీగా తెరకెక్కనున్న ఈ సినిమాలో తన పాత్ర ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేస్తుందని లావణ్యా త్రిపాఠి చెబుతున్నారు. క్యారెక్టర్ కోసం వర్క్‌షాప్స్‌కు కూడా అటెండ్ అవుతున్నారట. స్క్రిప్ట్‌తో పాటు తనకు స్క్రీన్‌ప్లే బాగా నచ్చిందని ఆమె తెలిపారు.ఈ సినిమాలో తన లుక్ కొత్తగా ఉంటుందని, క్యారెక్టర్ కోసం మేకోవర్ అవుతున్నానని, ఆ లుక్ ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్ చేస్తుందని లావణ్యా త్రిపాఠి పేర్కొన్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ చేశారు. ‘చావు కబురు చల్లగా’ తర్వాత ఆమె సంతకం చేసిన సినిమా ఇదే. మరో రెండు మూడు సినిమాలు చర్చల దశలో ఉన్నట్టు తెలుస్తుంది.