Sirivennela Seetharama Sastry: సిరివెన్నెల సీతారామ శాస్త్రి అకాల మరణం ఇరు తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు అని చెప్పాలి. తనదైన రచనలతో తెలుగు చిత్ర పరిశ్రమలో ముద్ర వేసిన సిరవెన్నెల మరణం సాహిత్యాభినులను, సినీ ప్రముఖులను శోఖ సంద్రంలో ముంచింది. ఓ గొప్ప కవిని, ఓ గేయ రచయితను కోల్పోయామని యావత్ తెలుగు రాష్ట్రాల ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సిరివెన్నెల మరణం తెలుగు సినీ రంగానికే కాక యావత్ సినీ పరిశ్రమకు తీరని లోటని చెప్పొచ్చు. అయితే ఈ తరుణంలో సిరివెన్నెల మరణానికి గల కారణాలు ఏంటని అందరిలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Also Read: Sirivennela Seetha Rama Sastri: ప్రముఖ కవి, గేయ రచయిత సిరివెన్నెల మృతిపై స్పందించిన… సీఎం జగన్
న్యూమోనియాతో బాధ పడుతున్న సిరివెన్నెలను ఈనెల 24వ తేదీన సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో ఆయన కుటుంబ సభ్యులు చేర్చారు. ఐసియూలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కన్నుమూసినట్లు వైద్యులు వెల్లడించారు. అయితే సిరివెన్నెల మరణానికి క్యాన్సర్ ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఆరేళ్ల క్రితమే సిరివెన్నెలకు లంగ్ క్యాన్సర్ వచ్చింది. ఆ సమయంలో ఒక ఊపిరితిత్తిలోని సగభాగాన్ని తీసేశారు. అప్పుడు ఆయనకు బైపాస్ సర్జీరీ కూడా నిర్వహించారు. ఇటీవలే మరో ఊపిరితిత్తికి క్యాన్సర్ వ్యాపించడంతో కొంత భాగం తీసేశారు. అయితే రెండు రోజుల వరకు బాగానే ఉన్న సిరివెన్నెల ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. దీనికి తోడు ఉపిరితిత్తుల్లో న్యూమోనియా రూపంలో ఇన్ఫెక్షన్ వ్యాపించింది. సిరివెన్నెలను రక్షించేందుకు 5 రోజుల పాటు ఎక్మోపై ఉంచి వైద్యులు చికిత్స అందించారు. అయితే శరీరం అంతా ఇన్ఫెక్షన్ వ్యాపించడంతో పాటు.. కిడ్నీ దెబ్బతినడంతో ఆయన ఈరోజు సాయంత్రం 4.07 నిమిషాలకు మరణించారు అని తెలుస్తుంది. సిరివెన్నెల మృతితో పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయఞ్జ మృతికి సంతాపంగా అభిమానులు, సినీ ప్రముఖులు నివాళులు అర్పిస్తూ పోస్ట్ లు చేస్తున్నారు.