Homeఎంటర్టైన్మెంట్R Madhavan: హీరో మాధవన్ అదృశ్యం.. విద్యార్థుల గాలింపు.. అసలు ఏమి జరిగిందంటే..

R Madhavan: హీరో మాధవన్ అదృశ్యం.. విద్యార్థుల గాలింపు.. అసలు ఏమి జరిగిందంటే..

R Madhavan: ఢిల్లీ లోని పార్లమెంట్ ఆవరణలో గత కొద్దీ రోజుల నుండి కాక్రోచ్ పార్టీ ఆద్వర్యం లో జరుగుతున్న విద్యార్థుల నిరసన కార్యక్రమాలు ఏ రేంజ్ లో జరుగుతున్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. నీట్ ప్రశ్నపత్రం లీకేజి పై సోనమ్ చేపడుతున్న ఆమరణ నిర్వహణ దీక్షకు మద్దతుగా , కాక్రోచ్ పార్టీ మద్దతుదారులు పార్లమెంట్ ని ముట్టడించారు. ఈ ఉద్యమం లో నిజమైన విద్యార్థులు కూడా కొంత శాతం ఉన్నారు. ఈ నేపథ్యం లో తమిళ […]

R Madhavan: ఢిల్లీ లోని పార్లమెంట్ ఆవరణలో గత కొద్దీ రోజుల నుండి కాక్రోచ్ పార్టీ ఆద్వర్యం లో జరుగుతున్న విద్యార్థుల నిరసన కార్యక్రమాలు ఏ రేంజ్ లో జరుగుతున్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. నీట్ ప్రశ్నపత్రం లీకేజి పై సోనమ్ చేపడుతున్న ఆమరణ నిర్వహణ దీక్షకు మద్దతుగా , కాక్రోచ్ పార్టీ మద్దతుదారులు పార్లమెంట్ ని ముట్టడించారు. ఈ ఉద్యమం లో నిజమైన విద్యార్థులు కూడా కొంత శాతం ఉన్నారు. ఈ నేపథ్యం లో తమిళ హీరో రంగనాథన్ మాధవన్ పై సోషల్ మీడియా లో తీవ్రమైన ట్రోల్స్ ఎదురు అవుతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే మాధవన్ ప్రస్తుతం ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కి చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. అయితే ఆయన ఆఫీస్ డోర్ పై విద్యార్థులు ‘గాయబ్’ పోస్టర్ ని అంటించారు.

‘గాయబ్’ అంటే తెలుగు లో ‘కనుబడుట లేదు’ అని అర్థం. అంతే కాకుండా ‘నీట్ ఫర్ సేల్’ అనే పోస్టర్ ని కూడా అంటించారు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా లో షేర్ చేయగా, అది ఇప్పుడు బాగా వైరల్ అయ్యింది. దేశంలోనే అత్యున్నత ఫిలిం ఇన్స్టిట్యూట్ కి చైర్మన్ గా వ్యహరిస్తూ , వేలమంది విద్యార్థుల భవిష్యత్తు ప్రస్నార్ధకంగా మారినప్పుడు స్పందించకోవడం దురదృష్టకరం అంటూ సోషల్ మీడియా వేదికగా ఆయన్ని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాకుండా సొంత కొడుకుని ఇండియా లో కాకుండా విదేశాల్లో చదివించే మాధవన్ కి ఇక్కడి విద్యార్థుల కష్టాలు ఎలా తెలుస్తాయి అంటూ ఆయనపై సెటైర్లు వేస్తున్నారు. మరి దీనిపై మాధవన్ రెస్పాన్స్ ఇస్తారో లేదో చూడాలి. రీసెంట్ గానే మాధవన్ ‘ధురంధర్’ సిరీస్ లో అజిత్ దోవల్ పాత్ర పోషించి , సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. కేవలం తమిళ సినిమాకు మాత్రమే పరిమితం కాకుండా, పాన్ ఇండియా లెవెల్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు మాధవన్.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper