spot_img
Homeఎంటర్టైన్మెంట్'పుష్ప'కి ‘అలా వైకుంఠపురంలో' ఫార్ములా !

‘పుష్ప’కి ‘అలా వైకుంఠపురంలో’ ఫార్ములా !

Pushpa Movie’అలా వైకుంఠపురంలో’.. అల్లు అర్జున్ స్థాయిని మార్కెట్ ని పెంచిన సినిమా. అందుకే, బన్నీ కెరీర్ లో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. అందుకే ఈ సినిమా విజయాన్ని, ఈ సినిమాని బన్నీ ఇప్పట్లో మర్చిపోయేలా లేడు. అయినా తన రేంజును అమాంతం పెంచేసిన సినిమాని ఎలా మర్చిపోతాడు లేండి. పైగా ఈ సినిమా ఇచ్చిన కిక్ కారణంగానే పాన్ ఇండియా మంత్రం వల్లిస్తూ ‘పుష్ప’ చేస్తున్నాడు.

సుకుమార్ డైరెక్క్షన్ లో ఈ “పుష్ప” పాటలు విడుదల చేసేందుకు సిద్ధం అయింది టీమ్. అయితే, పుష్పను ఇప్పుడు రిలీజ్ చేయాలనే ఆలోచనలో లేరు మేకర్స్, మరి ఎందుకు ఇంత త్వరగా సాంగ్స్ ను రిలీజ్ చేస్తున్నారు అంటే.. కారణం ‘అలా వైకుంఠపురంలో’ సినిమానే. అవును ఈ సినిమా పాటల ప్రమోషన్ ని ఐదు నెలల ముందే మొదలు పెట్టిన సంగతి తెలిసిందే.

నిజానికి ‘అలా వైకుంఠపురంలో’ మొదటి పాట సూపర్ హిట్ అయిన తర్వాతే.. ఆ సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. దానికి తోడు అన్ని పాటలు హిట్ అయ్యాయి. ఐదారు నెలల ముందే పాటలు విడుదల చేయడం… ఆ సాంగ్స్ జనంలోకి బాగా వెళ్లడం… మొత్తానికి సినిమా కలెక్షన్స్ కి బాగా ఉపయోగపడ్డాయి. అందుకే, బన్నీ పుష్ప సినిమాకి కూడా ‘అలా వైకుంఠపురంలో’ ఫార్ములానే ఫాలో అవ్వాలని ఫిక్స్ అయిపోయాడు.

ఈ క్రమంలోనే ‘పుష్ప’ మొదటి పాటను ఈ నెల 13న విడుదల చేస్తున్నారు. అంటే, సినిమా రిలీజ్ కి ఐదు నెలలు ముందు అన్నమాట. కాకపోతే ఇంకా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించలేదు, ఈ ఏడాది చివర్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మరి “దాక్కో దాక్కో మేక పులొచ్చి కొరుకుతోంది పీక” అని చంద్రబోస్ రాసిన ఈ పాట ఏ రేంజ్ లో హిట్ అవుతుందో చూడాలి.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Oktelugu Epaper