
అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి నిరసన రెండో రోజు కొనసాగుతోంది. రాత్రి తన అనుచరులతో అక్కడే నిద్రించిన జేసీ ఉదయం ఆరుబయటే ముఖం కడుక్కొని, స్నానం చేసి నిరసన తెలిపారు. నిన్న 11 గంటలకు మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించాలని నిర్ణయించిన జేపీ.. కార్యాలయానికి వెళ్లి చూడగా అక్కడ అధికారులు ఎవరూ లేరు. దీంతో సాయంత్రం వరకు అక్కడే వేచి ఉన్నారు. అయినప్పటికీ ఎవరూ రాకపోవడంతో ఆవేదన వ్యక్తం చేశారు.