’అలా వైకుంఠపురంలో’.. అల్లు అర్జున్ స్థాయిని మార్కెట్ ని పెంచిన సినిమా. అందుకే, బన్నీ కెరీర్ లో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. అందుకే ఈ సినిమా విజయాన్ని, ఈ సినిమాని బన్నీ ఇప్పట్లో మర్చిపోయేలా లేడు. అయినా తన రేంజును అమాంతం పెంచేసిన సినిమాని ఎలా మర్చిపోతాడు లేండి. పైగా ఈ సినిమా ఇచ్చిన కిక్ కారణంగానే పాన్ ఇండియా మంత్రం వల్లిస్తూ ‘పుష్ప’ చేస్తున్నాడు.
సుకుమార్ డైరెక్క్షన్ లో ఈ “పుష్ప” పాటలు విడుదల చేసేందుకు సిద్ధం అయింది టీమ్. అయితే, పుష్పను ఇప్పుడు రిలీజ్ చేయాలనే ఆలోచనలో లేరు మేకర్స్, మరి ఎందుకు ఇంత త్వరగా సాంగ్స్ ను రిలీజ్ చేస్తున్నారు అంటే.. కారణం ‘అలా వైకుంఠపురంలో’ సినిమానే. అవును ఈ సినిమా పాటల ప్రమోషన్ ని ఐదు నెలల ముందే మొదలు పెట్టిన సంగతి తెలిసిందే.
నిజానికి ‘అలా వైకుంఠపురంలో’ మొదటి పాట సూపర్ హిట్ అయిన తర్వాతే.. ఆ సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. దానికి తోడు అన్ని పాటలు హిట్ అయ్యాయి. ఐదారు నెలల ముందే పాటలు విడుదల చేయడం… ఆ సాంగ్స్ జనంలోకి బాగా వెళ్లడం… మొత్తానికి సినిమా కలెక్షన్స్ కి బాగా ఉపయోగపడ్డాయి. అందుకే, బన్నీ పుష్ప సినిమాకి కూడా ‘అలా వైకుంఠపురంలో’ ఫార్ములానే ఫాలో అవ్వాలని ఫిక్స్ అయిపోయాడు.
ఈ క్రమంలోనే ‘పుష్ప’ మొదటి పాటను ఈ నెల 13న విడుదల చేస్తున్నారు. అంటే, సినిమా రిలీజ్ కి ఐదు నెలలు ముందు అన్నమాట. కాకపోతే ఇంకా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించలేదు, ఈ ఏడాది చివర్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మరి “దాక్కో దాక్కో మేక పులొచ్చి కొరుకుతోంది పీక” అని చంద్రబోస్ రాసిన ఈ పాట ఏ రేంజ్ లో హిట్ అవుతుందో చూడాలి.