Fahad Fazil : మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. తమిళ, తెలుగు, మలయాళ చిత్రాల్లో నటిస్తూ సత్తా చాటుతున్నాడు. ఇటీవల ఆయన హీరోగా నటించిన ‘ ఆవేశం ‘ భారీ విజయం సాధించింది. అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఆవేశం దాదాపు రూ. 150 కోట్ల వసూళ్లు సాధించింది. ఆవేశం హిట్ తో ఫుల్ జోష్ లో ఉన్నారు ఫహద్ ఫాజిల్. ఈ చిత్ర నిర్మాత ఆయన భార్య నజ్రియా నజీమ్ నే కావడం మరో విశేషం.
నటుడిగా జోరు చూపిస్తున్న ఫహాద్ ఫాజిల్ ఓ అరుదైన వ్యాధి బారిన పడినట్లు తెలుస్తోంది. ఆయనకు అటెన్షన్ డెఫిసిట్ హైపర్యాక్టీవ్ డిజార్డర్(ADHD) అనే వ్యాధి సోకిందట. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. ఆయనకు 41 ఏళ్ల వయసులో ఈ వ్యాధి నిర్ధారణ అయిందని తెలిపారు. ఇది మెదడు పనితీరుపై ప్రభావం చూపుతుందని, దీని వల్ల ఏ విషయం మీద ఎక్కువ సేపు శ్రద్ధ పెట్టలేకపోతారని.
అతిగా ప్రవర్తించడం, తొందరగా ఆవేశపడటం వంటి లక్షణాలతో రోగులు బాధపడతారని ఆయన వెల్లడించారు. అయితే ఇది పిల్లల్లో సాధారణంగా కనిపించే డిజార్డర్ అని తెలుస్తుంది. కానీ పెద్దల్లో చాలా అరుదుగా వస్తుందట. కాగా ప్రస్తుతం దీనికి చికిత్స తీసుకుంటున్నాను అని ఫహాద్ ఫాజిల్ చెప్పారు. ఫహాద్ అరుదైన వ్యాధి బారిన పడ్డాడని తెలిసిన ఆయన ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.
ఈ వ్యాధి గురించి పూర్తిగా తెలుసుకుందాం .. అటెన్షన్ డెఫిసిట్ హైపర్యాక్టివిటీ డిజార్డర్ సోకిన వారిలో ఎక్కువగా మతిమరుపు ఉంటుంది. ఏదైనా పని చేయాలనుకొని మర్చిపోవడం, ఎక్కడికైనా ఆలస్యంగా రావడం. ఏకాగ్రత లేకపోవడం, చిన్న చిన్న పనులు చేయడానికి కూడా ఇబ్బంది పడటం వంటివి ఈ వ్యాధి లక్షణాలు. కాగా ఫహాద్ ఫాజిల్ పుష్ప 2లో మెయిన్ విలన్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. పుష్ప లో భన్వర్ సింగ్ షెకావత్ క్యారెక్టర్ లో ఆయన పండించిన విలనిజం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక పార్ట్ 2 లో అంతకుమించి ఉండబోతుంది. ఇక ఆగష్టు 15న పుష్ప 2 వరల్డ్ వైడ్ పలు భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రం కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.