https://oktelugu.com/

pushpa movie : “పుష్ప”లో కీ పాయింట్ ఇదే!

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ – అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కిన పుష్ప మూవీ ఇవాళే రిలీజ్ అవుతోంది. మధ్యాహ్నం లోగా ఫస్ట్ టాక్ బయటకు వచ్చేస్తుంది. అయితే.. ఈ లోగా ఈ సినిమాకు సంబంధించిన కీ పాయింట్ ఒకటి లీకైంది. ఈ చిత్రంలో ఈ పాయింటే మెయిన్ ఎలివేషన్ గా ఉంటుందని టాక్. పుష్ప సినిమా స్టోరీ ఏంటీ అన్నప్పుడు అందరూ.. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపధ్యంలో ఈ సినిమా సాగుతుందని చెబుతారు. మూవీ మేకర్స్ ఈ విషయాన్ని […]

Written By: , Updated On : December 17, 2021 / 11:16 AM IST
Follow us on

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ – అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కిన పుష్ప మూవీ ఇవాళే రిలీజ్ అవుతోంది. మధ్యాహ్నం లోగా ఫస్ట్ టాక్ బయటకు వచ్చేస్తుంది. అయితే.. ఈ లోగా ఈ సినిమాకు సంబంధించిన కీ పాయింట్ ఒకటి లీకైంది. ఈ చిత్రంలో ఈ పాయింటే మెయిన్ ఎలివేషన్ గా ఉంటుందని టాక్.

icon star allu arjun pushpa movie review

పుష్ప సినిమా స్టోరీ ఏంటీ అన్నప్పుడు అందరూ.. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపధ్యంలో ఈ సినిమా సాగుతుందని చెబుతారు. మూవీ మేకర్స్ ఈ విషయాన్ని చెప్పేశారు. ట్రైలర్ కూడా ఇదే విషయాన్ని రివీల్ చేసింది. దీంతో.. స్మగ్లర్ ను హీరోగా ఎలా చూపిస్తారు? అనే క్యూరియాసిటీ అందరిలో డెవలప్ అయ్యింది. అయితే.. అయితే ఈ మూవీలో మరో ఎమోషనల్ పాయింట్ కూడా ఉందని తెలిసింది.

ఇదోక సవతి కొడుకుల కథ అని టాక్. ఈ మూవీలో అల్లు అర్జున్, అజయ్ ఇద్దరు సవతుల కొడుకులు అని తెలుస్తోంది. అంటే.. తండ్రి ఒక్కరేగానీ తల్లులు మాత్రం వేరు. ఇందులో అజయ్ పెద్దవాడు కాగా.. అల్లు అర్జున్ చిన్నవాడు. ఈ పాత్రకు ఇంట్లో ప్రేమ, గౌరవం సరిగా దక్కవట. దీంతో.. తీవ్ర ఆవేదనతో బయటకు వెళ్లిపోతాడు. తన అన్నకన్నా.. తానే పవర్ ఫుల్ కావాలనే కసితో.. పుష్ప రాజ్ గా ఎదుగుతాడట హీరో!

ఈ ఫార్ములాతో ఇప్పటి వరకు చాలా సినిమాలు వచ్చాయి. పవన్ బ్లాక్ బస్టర్ గబ్బర్ సింగ్ లోనూ ఈ పాయింట్ ఉంది. మంచి ఎమోషన్ క్యారీ చేసే పాయింట్ ఇది. ఈ పాయింట్ తో వచ్చిన సినిమాలు చాలా వరకు హిట్ కొట్టాయి కూడా. మరి, పుష్ప ఎలాంటి రిజల్ట్ సాధిస్తుందన్నది చూడాలి. ఇప్పటి వరకు వచ్చిన ట్విట్టర్ రివ్యూలు మాత్రం పాజిటివ్ గానే ఉన్నాయి. ఫుల్ అండ్ పర్పెక్ట్ రివ్యూ కోసం చూస్తూనే ఉండండి ఓకే తెలుగు.