https://oktelugu.com/

Pushpa Movie: యూఎస్ ప్రీమియర్స్ కలెక్షన్స్ లో రికార్డు … 2021 లో అల్లు అర్జున్ టాప్

Pushpa Movie: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ సక్సెస్‌ఫుల్ కాంబోలో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ‘పుష్ప’ మూవీ నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. షూటింగ్ ప్రారంభం నుంచి డైరెక్టర్ సుకుమార్ వదిలిన ప్రతి అప్‌డేట్ కూడా బాగా వైరల్ కావడంతో ఈ సినిమాపై ఓ రేంజ్ హైప్ క్రియేట్ అయింది. దీంతో భారీ అంచనాల నడుమ పుష్ప రాజ్ థియేటర్లలో అడుగుపెట్టారు. ఎప్పటిలాగే ఓవర్సీస్‌లో ‘పుష్ప’ ప్రీమియర్ షోస్ పడ్డాయి. అయితే విడుదలకు ముందు నెలకొన్న […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 17, 2021 / 11:22 AM IST
    Follow us on

    Pushpa Movie: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ సక్సెస్‌ఫుల్ కాంబోలో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ‘పుష్ప’ మూవీ నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. షూటింగ్ ప్రారంభం నుంచి డైరెక్టర్ సుకుమార్ వదిలిన ప్రతి అప్‌డేట్ కూడా బాగా వైరల్ కావడంతో ఈ సినిమాపై ఓ రేంజ్ హైప్ క్రియేట్ అయింది. దీంతో భారీ అంచనాల నడుమ పుష్ప రాజ్ థియేటర్లలో అడుగుపెట్టారు. ఎప్పటిలాగే ఓవర్సీస్‌లో ‘పుష్ప’ ప్రీమియర్ షోస్ పడ్డాయి. అయితే విడుదలకు ముందు నెలకొన్న భారీ హైప్‌తో యూఎస్ ప్రీమియర్స్‌కి ఈ ఏడాది ఏ సినిమాకు లేనంతగా డిమాండ్ నెలకొంది.

    Pushpa Movie

    allu arjun pushpa movie us premiers collection details

    Also Read: పుష్ప టీమ్​కు ఆర్​ఆర్​ఆర్​ యూనిట్​ స్పెషల్​ విషెస్​.. తగ్గేదెలే అంటూ ట్వీట్
    దీంతో విదేశాల్లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ‘పుష్ప ది రైజ్’ చూసేందుకు క్యూ కట్టేశారు. మొత్తంగా యూఎస్ లోని 248 లొకేషన్స్‌లో పుష్ప చిత్రాన్ని విడుదల చేయగా… ఈ ప్రీమియర్స్ ద్వారా దాదాపు 406కే డాలర్స్ వసూలు చేసినట్లు సమాచారం. దీంతో 2021 సంవత్సరంలో బిగ్గెస్ట్ ప్రీమియర్స్ గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిన తొలి రెండు చిత్రాల్లో ఒకటిగా పుష్ప నిలిచింది. ప్రీమియర్స్ షోస్ చూసిన ఆడియన్స్ పుష్ప సినిమాపై మిశ్రమంగా స్పందిస్తున్నారు. సుకుమార్ టేకింగ్, పుష్ప తొలి భాగానికి రెండో భాగానికి లింక్ చేసిన విధానానికి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఈ చిత్రం ఫస్ట్ షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకొని సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఇంతకాలం స్టైలిష్ పాత్రల్లో కనిపించిన అల్లు అర్జున్ ఓ లారీ డ్రైవర్‌గా ఊర మాస్ పాత్ర చేయడం, రష్మిక కంప్లీట్ డీ గ్లామర్ రోల్ చేయడం ప్రాజెక్ట్‌పై అంచనాలు మరో స్థాయికి తీసుకు వచ్చాయి. ఇది అల్లు అర్జున్ వన్ మ్యాన్ షో అని, పుష్పరాజ్‌గా బన్నీ అదరగొట్టేశారని అంటున్నారు. కాకపోతే ఓవరాల్‌గా ఈ సినిమా ఊహించిన అంచనాలను అందుకోలేక పోయిందని పలువురు అభిప్రాపడుతున్నారు.

    Also Read: పుష్పరాజ్​కు అయాన్​ స్పెషల్​ విషెస్​.. నెట్టింట్లో పోస్ట్​ వైరల్​