https://oktelugu.com/

Ram Charan: “పుష్ప” రాజ్ కు బెస్ట్ విషెస్ చెప్పిన చిట్టిబాబు ” రామ్ చరణ్ “…

Ram Charan: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన హ్యాట్రిక్ సినిమా ‘పుష్ప – ది రైజ్. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. కాగా ఈరోజు పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయిన ఈ చిత్రం ఫస్ట్ షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకొని సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఇంతకాలం స్టైలిష్ పాత్రల్లో కనిపించిన అల్లు అర్జున్ ఓ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 17, 2021 / 11:16 AM IST
    Follow us on

    Ram Charan: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన హ్యాట్రిక్ సినిమా ‘పుష్ప – ది రైజ్. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. కాగా ఈరోజు పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయిన ఈ చిత్రం ఫస్ట్ షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకొని సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఇంతకాలం స్టైలిష్ పాత్రల్లో కనిపించిన అల్లు అర్జున్ ఓ లారీ డ్రైవర్‌గా ఊర మాస్ పాత్ర చేయడం, రష్మిక కంప్లీట్ డీ గ్లామర్ రోల్ చేయడం ప్రాజెక్ట్‌పై అంచనాలు మరో స్థాయికి తీసుకు వచ్చాయి. ఇక సుకుమార్ – అల్లు అర్జున్ – మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ కాంబినేషన్‌లో వచ్చిన బిగ్గెస్ట్ మ్యూజికల్ హిట్‌గాను ‘పుష్ప: ది రైజ్’ నిలిచింది.

    Ram Charan and Allu Arjun

    Also Read: థియేటర్​లో ఫ్యామిలీతో పుష్పరాజ్​ సందడి.. ఎగబడిన అభిమానులు

    ఇప్పటికే ఈ సినిన చూసిన సినీ ప్రముఖులందరూ దర్శకుడు సుకుమార్ – హీరో అల్లు అర్జున్‌లతో పాటు హీరోయిన్ రష్మిక మందన్న, చిత్ర నిర్మాతల మీద ఇతర సాంకేతిక నిపుణులపైన ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ నేథ్యంలో తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ట్విట్టర్ వేదికగా అల్లు అర్జున్ కు విషెస్ తెలియజేశారు. ఈ మేర ఆ పోస్ట్ లో ” పుష్ప సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటూ చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ కేప్పారు రామ్ చరణ్. ఈ మూవీ ఘన విజయం సాధిస్తుందని, బన్నీ కెరీర్ లో ఓ మైలు రాయిగా పుష్ప నిలుస్తుందని చెర్రీ అన్నారు. రష్మికని పొగడ్తలతో ముంచేసారు రామ్ చరణ్. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

    https://twitter.com/AlwaysRamCharan/status/1471684298629476355?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1471684298629476355%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.andhrajyothy.com%2Ftelugunews%2Fcharan-praises-pushpa-movie-grk-mrgs-chitrajyothy-192112171025136

    Also Read: అల్లు అర్జున్ రీల్ హీరో కాదు, రియల్ హీరో !