Pushpa Fame Fahadh Faasil Remuneration And Conditions
Fahadh Faasil: మలయాళ సినిమా ఇండస్ట్రీలో తన కెరియర్ ను మొదలుపెట్టిన ఫాహాద్ ఫజిల్ చాలా తక్కువ సమయం లోనే ఇండియాలోనే టాప్ నటుడిగా చాలా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక అందులో భాగంగానే ఆయన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమాలో కూడా నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.
ఇక ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్ లో కూడా ఆయన ఇన్వాల్వ్ అయినట్టుగా తెలుస్తుంది. ఇంక పుష్ప 2 సినిమా సినిమాలో తను కీలక పాత్ర వహించబోతున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఆయన కోసం చాలామంది దర్శకులు ప్రత్యేకమైన పాత్రలను కూడా రాసుకుంటున్నారు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇప్పటికే ఆయన చాలా వైవిధ్యమైన పాత్రలను పోషించి నటుడిగా చాలా ఉన్నతమైన శిఖరాలను అదిరోహించాడు. ఇక ఇలాంటి నటుడు రోజుకి 12 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు అనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
నిజానికి ఆయన మీద మంచి మార్కెట్ అవుతుంది. కాబట్టి ఆయనకు 12 లక్షలు ఇవ్వడంలో తప్పేమీ లేదు అంటూ మరి కొంతమంది మాట్లాడుతున్నారు. ఇక ఇదిలా ఉంటే సినిమాకి డేట్స్ ఇచ్చిన ఆయన ఒకవేళ ఆ రోజు షూటింగ్ కనక క్యాన్సిల్ అయితే తను తీసుకునే 12 లక్షలతో పాటు మరొక రెండు లక్షలని కూడా అదనంగా కలుపుకొని 14 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారట. ఇక దీనివల్ల తన డేట్స్ అనేవి అసలు వేస్ట్ అవ్వవు అనే ఉద్దేశ్యంతోనే ఆయన ఇలాంటి నిర్ణయాన్ని తీసుకున్నాడు అంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: Double iSmart: లైగర్ మూవీ ఎఫెక్ట్ డబుల్ ఇస్మార్ట్ మీద పడుతుందా..?
ఇక మొత్తానికైతే ఫాహాద్ ఫజిల్ తన విశ్వరూపాన్ని చూపిస్తూ ముందుకు దూసుకెళ్ళడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి.. రీసెంట్ గా ‘ఆవేశం ‘ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అందులో ఒక డిఫరెంట్ పాత్రను పోషించి నటుడిగా మరోసారి తనని తాను ప్రూవ్ చేసుకున్నాడు..