https://oktelugu.com/

Prabhas – Nithya Menon : ప్రభాస్ వలన నిత్యా మీనన్ కి తీరని అన్యాయం, అది జీవితంలో పెద్ద ఎదురుదెబ్బ అన్న మలయాళీ హీరోయిన్!

Prabhas - Nithya Menon ఆమె చివరిసారిగా పవన్ కళ్యాణ్ కి జంటగా భీమ్లా నాయక్ చిత్రంలో నటించింది. ప్రస్తుతం తమిళంలో రెండు చిత్రాల్లో నిత్యా మీనన్ నటిస్తున్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : June 18, 2024 / 11:46 AM IST

    Prabhas - Nithya Menon

    Follow us on

    Prabhas – Nithya Menon : ప్రభాస్ కారణం నిత్యా మీనన్ తీవ్ర విమర్శలపాలైంది. ఆ పరిణామం తనను మానసికంగా ఒత్తిడికి గురి చేసిందని ఆమె అన్నారు. నిజాయితీగా ఉండకూడదని తెలుసుకున్నానని నిత్యా మీనన్ ఆవేదన వ్యక్తం చేశారు. అసలు ఏం జరిగింది? ప్రభాస్ కారణంగా నిత్యా మీనన్ ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటనేది చూద్దాం… మలయాళీ భామ నిత్యా మీనన్ కి తెలుగులో కూడా స్టార్డం ఉంది. ‘అలా మొదలైంది’ చిత్రంతో టాలీవుడ్ కి పరిచయం అయ్యింది. నాని హీరోగా లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది.

    మొదటి చిత్రంతోనే నిత్యా మీనన్ తెలుగు ప్రేక్షకుల మనసులు దోచేసింది. ఆమె అద్భుతమైన యాక్టింగ్, క్యూట్ వాయిస్ మనసులు దోచేసింది. అలా మొదలైంది సక్సెస్ నేపథ్యంలో ఆమెకు తెలుగులో వరుస ఆఫర్స్ వచ్చాయి. కాగా టాలీవుడ్ కి వచ్చిన కొత్తలో ఆమెకు ప్రభాస్ గురించి ప్రశ్న ఎదురైంది. మలయాళీ పరిశ్రమకు చెందిన నిత్యా మీనన్ కి టాలీవుడ్ గురించి పెద్దగా అవగాహన లేదు. దాంతో ప్రభాస్ ఎవరో నాకు తెలియదు… అని సమాధానం చెప్పింది.

    అప్పట్లో నిత్యా మీనన్ చేసిన ఈ కామెంట్స్ వివాదాస్పదం అయ్యింది. ప్రభాస్ ఫ్యాన్స్ చాలా హర్ట్ అయ్యారు. నిత్యా మీనన్ ని ట్రోల్ చేశారు. ఈ ఘటన తనపై తీవ్ర ప్రభావం చూపిందని నిత్యా మీనన్ ఓ సందర్భంలో చెప్పారు. నేను టాలీవుడ్ కి కొత్త. తెలుగు సినిమాలు చూసిందే లేదు. అందుకే ప్రభాస్ గురించి అడిగితే… నాకు తెలియదు అన్నాను. నేను నిజాయితీగా సమాధానం చెప్పాను. కానీ చిన్న పిల్లను అని కూడా చూడకుండా నన్ను ట్రోల్ చేశారు.

    అది నా జీవితంలో జరిగిన పెద్ద ఎదురుదెబ్బ. చాలా విషయాలు నేర్చుకున్నాను. ప్రతి చోటా నిజాయితీగా ఉండకూడదని నిర్ణయం తీసుకున్నాను. నా అమాయకత్వంతో ఆడుకున్నారని… నిత్యా మీనన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే వంటి హిట్ చిత్రాల్లో నిత్యా మీనన్ నటించింది. ఆమె చివరిసారిగా పవన్ కళ్యాణ్ కి జంటగా భీమ్లా నాయక్ చిత్రంలో నటించింది. ప్రస్తుతం తమిళంలో రెండు చిత్రాల్లో నిత్యా మీనన్ నటిస్తున్నారు.