Khairatabad Ganesh: ఖైరతాబాద్‌ గణేశుడి తయారీ షురూ.. ఈసారి ఎన్నడుగులో తెలుసా?

Khairatabad Ganesh: వినాయక చవితి కోసం కూడా గణపతి విగ్రహం తయారీ సోమవారం(జూన్‌ 17)న ప్రారంభించారు. గణనాథుడిని నిలిపే స్థానంలో కర్రపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దానం నాగేందర్‌ పాల్గొన్నారు.

Written By: Raj Shekar, Updated On : June 18, 2024 12:40 pm

Khairatabad Ganesh manufacturing start

Follow us on

Khairatabad Ganesh: గణేశ్‌ నవరాత్రి ఉత్సవాల్లో తెలంగాణలో ప్రత్యేకంగా నిలిచేది ఖైరతాబాద్‌ మహా గణేశుడు. వరల్డ్‌ ఫేమస్‌ అయిన ఈ గణనాథుడు గతేడాదే ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఈ ఏడాది తన రికార్డును తానే తిరగరాయనున్నాడు. మహా గణపతిని నగర వాసులే కాదు దేశ విదేశాల నుంచి భక్తులు వచ్చి దర్శించుకుంటారు. పండుగకు రెండు నెలల ముందే విగ్రహం తయారు చేస్తారు. ఈ ఏడాది వినాయక చవితి కోసం కూడా గణపతి విగ్రహం తయారీ సోమవారం(జూన్‌ 17)న ప్రారంభించారు. గణనాథుడిని నిలిపే స్థానంలో కర్రపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దానం నాగేందర్‌ పాల్గొన్నారు.

70 అడుగుల ఎకో ఫ్రెండ్లీ విగ్రహం..
ఖైరతాబాద్‌లో ఈ వినాయక చవితి కోసం 70 అడుగుల విగ్రహం తయారు చేయాలని నిర్ణయించారు. గతేడాది 63 అడుగుల ఎత్తులో దర్శన మిచ్చిన గణనాథుఏడు ఈసారి పర్యావరణ హితంగా 70 అడుగుల ఎత్తులో భక్తులకు దర్శనమివ్వనున్నాడు. పూర్తిగా మట్టితోనే దీనిని తయారుచేయనున్నారు. ఈమేరకు నిర్జల ఏకాదశి పురస్కరించుకుని జూన్‌ 17 సాయంత్రం 5 గంటలకు విగ్రహం తయారీకి కర్రపూజ చేశారు.

గతేడాది ఇలా..
గతేడాది 45 నుంచి 50 టన్నుల బరువుతో 63 అడుగుల ఎత్తులో పూర్తిగా మట్టి వ ఇగ్రహంగా ఖైరతాబాద్‌ గణనాథుడు రికార్డు సృష్టించాడు. ఈ ఏడాది మరో 7 అడుగులు ఎత్తుతో భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు. దీంతో గణనాథుడు తన రికార్డును తానే బ్రేక్‌ చేయబోతున్నాడు.

ఘనంగా ఉత్సవాలు..
ఈ ఏడాది సెప్టెంబర్‌ 7వ తేదీన వినాయక చవితి వస్తోంది. ఈ ఏడాది రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో వినాయక చవితి ఉత్సవాలను కూడా ఘనంగా నిర్వహిస్తామని ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ తెలిపారు. దర్శనానికి వచ్చే ప్రతీ భక్తుడికి ప్రసాదం అందిస్తామని పేర్కొన్నారు. అన్ని శాఖల సమన్వయంతో ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని వెల్లడించారు.