Pushpa 2 First Day Collection: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2 : ది రూల్’ చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ టాక్ ని తెచ్చుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రానికి నేషనల్ వైడ్ గా బంపర్ ఓపెనింగ్స్ వస్తాయని అందరూ ముందుగానే ఊహించారు. కానీ ఓపెనింగ్ వసూళ్లు మాత్రం ఆ ఊహకి మించే ఉన్నాయి. సినిమాకి యావరేజ్ టాక్ వచ్చినా చాలు అనుకున్నారు ఫ్యాన్స్. కానీ ఏకంగా బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. ఆ రేంజ్ టాక్ వస్తే వసూళ్లు ఎలా ఉంటాయని ఊహించుకున్నామో అంతకు మించే వచ్చేట్టు ఉంది. ముందుగా తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి 60 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు, వంద కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చేలా కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో ఈ సినిమా షోస్ కొన్ని ప్రత్యేక పరిస్థితులు కారణంగా క్యాన్సిల్ అయ్యాయి.
ఉదాహరణకి కర్ణాటక లో కన్నడ ఫిలిం ఛాంబర్ వారు ‘పుష్ప 2’ చిత్రానికి సంబంధించిన బెన్ఫిట్ షోస్, స్పెషల్ షోస్ ని క్యాన్సిల్ చేయాల్సిందిగా పిటీషన్ వేయగా, కలెక్టర్ బెంగుళూరు లో క్యాన్సిల్ చేసారు. అదే విధంగా హైదరాబాద్ లో మొదటిరోజు అత్యధిక గ్రాస్ ని ఇచ్చే ప్రసాద్ మల్టీ ప్లెక్స్ వంటి చోట్ల కూడా పర్సెంటేజ్ సమస్యల కారణంగా ‘పుష్ప 2’ చిత్రాన్ని ప్రదర్శించడం లేదట. ఇలా ఓవర్సీస్ లో కొన్ని చోట్ల సెన్సార్ సమస్యలు ఉన్నాయి. ఇన్ని అడ్డంకుల మధ్య కూడా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ సినిమాలలో ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డుని నెలకొల్పబోతుందని సమాచారం. ట్రేడ్ పండితులు ముందస్తు అంచనాల ప్రకారం ఈ సినిమాకి మొదటి రోజు 300 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వస్తాయని చెప్పుకొచ్చారు.
కానీ ఇప్పుడు ఈ సినిమాకి జరుగుతున్న అడ్వాన్స్ బుకింగ్ చూస్తుంటే ఏకంగా 340 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లకు పైగా వచ్చేట్టు ఉందని అంటున్నారు. బుక్ మై షో టికెట్ సేల్స్ పోర్టల్ యాప్ లో గంటకి లక్ష టిక్కెట్లు అమ్ముడుపోతున్నాయి. తెలుగు ఆడియన్స్ తో పాటు, అన్ని భాషలకు సంబంధించిన ఆడియన్స్ కూడా ఒకే రేంజ్ లో ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతుండడం వల్లే ఈ రేంజ్ బుకింగ్స్ నడుస్తున్నాయి. ఊపు చూస్తుంటే కచ్చితంగా ఈ చిత్రానికి 340 కోట్లు ఖాయమని అంటున్నారు. ఎన్టీఆర్ నటించిన దేవర చిత్రానికి ఫుల్ రన్ లో 390 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. కానీ పుష్ప 2 చిత్రానికి మొదటి రోజే ఆ రేంజ్ వసూళ్లు రావడం గమనార్హం. రేపటితో ఈ సినిమా ‘దేవర’ క్లోజింగ్ కలెక్షన్స్ ని పూర్తిగా దాటేసే అవకాశం ఉంది. వీకెండ్ కి 700 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.