https://oktelugu.com/

Kapu Reservation : కాపులకు రిజర్వేషన్లు.. హైకోర్టు సంచలన  ఆదేశాలు

 కాపులకు రిజర్వేషన్ అనే అంశం ఇప్పటిది కాదు. దశాబ్దాలుగా కొనసాగుతోంది ఈ నినాదం. దీనికి ఇప్పట్లో ఫుల్ స్టాప్ పడేలా లేదు. సరిగ్గా ఇటువంటి సమయంలోనే ఏపీ హైకోర్టు దీనిపై అభ్యంతరాలు చెప్పడం విశేషం.

Written By:
  • Dharma
  • , Updated On : December 5, 2024 / 02:19 PM IST

    Kapu Reservation

    Follow us on

    Kapu Reservation : మరోసారి కాపులకు రిజర్వేషన్ అంశం తెరపైకి వచ్చింది. 2014లో టిడిపి అధికారంలోకి వచ్చింది. ఆ ఎన్నికల్లో కాపులకు రిజర్వేషన్లు ప్రకటిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ హామీని అమలు చేయాలని కోరుతూ ఉద్యమాలు జరిగాయి. దీంతో చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఐదు శాతం ఈబీసీ రిజర్వేషన్లు కల్పిస్తూ అప్పట్లో నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు.  ఆర్థికపరమైన అంశాలకు సంబంధించి రాయితీలు కూడా కల్పించారు. చాలా రకాల ప్రత్యేక పథకాలను అమలు చేశారు. అయితే2019లో జగన్ అధికారంలోకి వచ్చారు. చంద్రబాబు సర్కార్ ప్రకటించిన ఐదు శాతం ఈబీసీ రిజర్వేషన్లను రద్దు చేశారు. దీంతో కాపులకు దూరమయ్యారు. కూటమి అధికారంలోకి వస్తే ఈ బీసీ రిజర్వేషన్లు పునరుద్ధరిస్తామని  చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అవుతున్నా   ఈ రిజర్వేషన్లను పునరుద్ధరించలేదు. దీంతో మాజీ ఎంపీ హరిరామ జోగయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అదే సమయంలో ఐదు శాతం రిజర్వేషన్లు ఇవ్వవద్దని మరికొందరు సైతం హైకోర్టును ఆశ్రయించారు. ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను దాఖలు చేశారు.
    * హరి రామ జోగయ్య పిటిషన్ 
     హరి రామ జోగయ్య దాఖలు చేసిన పిటిషన్ పై ఈరోజు హైకోర్టు విచారించింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కల్పన చట్టానికి లోబడి కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై హైకోర్టు సందేహం వ్యక్తం చేసింది. 103 రాజ్యాంగ సవరణ, కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ల చట్టాలను సుప్రీంకోర్టులో సవాలు చేసిన పిటిషన్లపై పూర్తి నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. సాధారణంగా ఆర్థికంగా వెనుకబాటుతనం ఉన్న అగ్రకులాలకు.. ఈడబ్ల్యూఎస్ లో విద్య, ఉపాధి అవకాశాల్లో 10% రిజర్వేషన్ల కల్పన చట్టానికి లోబడి.. కొంత మినహాయింపులు ఇవ్వచ్చు. అప్పట్లో చంద్రబాబు ఐదు శాతం ఇదే మాదిరిగా ఇచ్చారు. అయితే ఉన్నది 10 శాతం.. అందులో ఐదు శాతం కాపులకు ఇస్తే మిగతా వారి పరిస్థితి ఏంటన్నది కోర్టు అనుమానం.
     * ఆ నివేదికలను కోరిన హైకోర్టు 
     గతంలో సుప్రీంకోర్టులో ఇటువంటి పిటిషన్లపై విచారణ జరిగింది. అదే సమయంలో 103 రాజ్యాంగ సవరణ, కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ల చట్టాలను సుప్రీంకోర్టులో సవాలు చేసిన పిటిషన్లపై పూర్తి నివేదిక ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. విచారణను జనవరి 29కి వాయిదా వేసింది. దీంతో కాపు రిజర్వేషన్ అంశం మరోసారి చర్చకు దారితీసింది. కాపులకు ఈ బీసీ రిజర్వేషన్లు కొనసాగించి.. పథకాలు అమలు చేయాలని చంద్రబాబు సర్కార్ కృతనిశ్చయంతో ఉంది. కానీ కోర్టు అభ్యంతరకర వ్యాఖ్యలతో ఈ అంశం మరోసారి గందరగోళంలో పడింది.