Homeఎంటర్టైన్మెంట్Pushpa 2 Pre Release Event: అటు అల్లు అరవింద్ కు.. ఇటు అల్లు అర్జున్...

Pushpa 2 Pre Release Event: అటు అల్లు అరవింద్ కు.. ఇటు అల్లు అర్జున్ కు.. ఇది ఎమోషనల్ మూమెంట్.. వైరల్ వీడియో

Pushpa 2 Pre Release Event: అల్లు అర్జున్ ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సోషల్ మీడియాలో బాగా పాపులర్. వారికి అక్కడ సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అల్లు అర్జున్ తనయుడు అల్లు అయాన్‌కు ఇప్పటికే సోషల్ మీడియా సెన్సేషన్ అయిపోయాడు. ఆయన ఏం చేసినా మీమ్స్, రీల్స్ ట్రెండ్ అవ్వడం ఖాయం. అలాగే ‘పుష్ప 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు కూడా తన చెల్లెలు అర్హతో కలిసిన స్పెషల్ ఎంట్రీ ఇచ్చాడు. ఇక ‘పుష్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్ సమయంలో కూడా అయాన్, అర్హ వచ్చి ఇలాగే వారి అభిమానులను అలరించగా.. ఈసారి మాత్రం అయాన్ తన తండ్రి అల్లు అర్జున్‌ షాక్ అయ్యే విధంగా స్పీచ్ ఇరగదీశాడు.

అల్లు అయాన్ స్టేజ్ ఎక్కగానే మైక్ అందుకుని అంతమంది ఉన్నారన్న కాస్త భయం కూడా లేకుండా ‘‘అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ఒక మాట చెప్పాలి. మీ అందరికీ పుష్ప చాలా నచ్చుతుంది. ఇంకా తగ్గేదే లే’’ అంటూ అల్లు అర్జున్ మ్యానరిజాన్ని ఇమిటేట్ చేశాడు. తను మాట్లాడుతున్నంతసేపు తన తండ్రి అల్లు అర్జున్ షాక్‌లోనే ఉన్నాడు. అంతే కాకుండా తగ్గేదే లే అన్నప్పుడు తను మరింత షాక్‌లోకి వెళ్లిపోయినట్లు కనిపించింది. మొత్తానికి అల్లు అయాన్ అంత స్పీచ్ ఇస్తాడని అల్లు అర్జున్ అస్సలు ఊహించలేదనుకుంటా. ఇక అర్హ మాత్రం తాను ఎలాంటి స్పీచ్ ఇవ్వాలని అనుకోవడం లేదని చెప్పింది. కానీ చివర్లో తాను కూడా అటజని కాంచె తెలుగు పద్యం చెప్పి అందరికీ షాకిచ్చింది.

అందరికీ హాయ్ అని మాత్రమే చెప్పి వెళ్లిపోవాలని భావించింది అల్లు అర్హ. కానీ అర్హ చెప్తున్న తెలుగు పద్యాలు, శ్లోకాలు ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో దాని గురించి ప్రస్తావించారు యాంకర్ సుమ. దీంతో తను అటజని కాంచె తెలుగు పద్యం చెప్పింది. అది విన్న తర్వాత మళ్లీ అల్లు అర్జున్ షాకయ్యాడు. అంతే కాకుండా స్టేజ్ దిగిన వెంటనే అయాన్, అర్హను దగ్గరకు తీసుకున్నారు. మొత్తం స్టేజ్ మీద తన కూతురు, కొడుకును చూసిన ప్రతి ఒక్కరు అటు అల్లు అరవింద్ కు.. ఇటు అల్లు అర్జున్ కు.. ఇది ఎమోషనల్ మూమెంట్ అని కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ‘పుష్ప 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఎన్నో హైలెట్స్ ఉండగా అందులో అయాన్, అర్హ స్పీచ్ కూడా మరో హైలెట్ గా నిలిచింది. అంతే కాకుండా ఈ ఈవెంట్‌కు వచ్చిన ప్రతీ ఒక్క గెస్ట్ కూడా ‘పుష్ప 2’పై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ మూవీ పక్కా హిట్ అని ఫిక్స్ అయిపోయారు. ‘పుష్ప 2’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రాజమౌళి ముఖ్య అతిథిగా వచ్చారు. అంతే కాకుండా యంగ్ డైరెక్టర్స్ వివేక్ ఆత్రేయ, శివ నిర్వాణ, గోపీచంద్ మలినేని, బుచ్చిబాబు కూడా ఈ ఈవెంట్‌కు విచ్చేశారు.

 

Allu Ayaan and Allu Arha Superb Speech @ Pushpa 2 Pre Release Event | Allu Arjun Reaction

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version