https://oktelugu.com/

Pushpa 2 Pre Release Event : దూసుకొచ్చిన ఫ్యాన్.. బన్నీ ఏం చేశాడో తెలుసా?

డిసెంబర్ 5న పుష్ప 2 చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒకరోజు ముందుగా అంటే డిసెంబర్ 4న తెలుగు రాష్ట్రాల్లో సెలక్టడ్ థియేటర్లలో ప్రీమియర్ షోలు వేయబోతున్నారు. అభిమానులు ఇప్పటికే వేలకు వేల రూపాయలు వెచ్చించి సినిమా టిక్కెట్లు ముందస్తుగా కొనుగోలు చేశారు.

Written By:
  • Rocky
  • , Updated On : December 3, 2024 / 08:43 AM IST

    Pushpa 2 Pre Release Event(3)

    Follow us on

    Pushpa 2 Pre Release Event : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ భారీ బడ్జెట్ చిత్రం పుష్ప.. గతంలో విడుదలైన పుష్ప ది రైజ్ ఈ సినిమా సూపర్ హిట్ టాక్ అందుకుంది. ఆ సినిమా హిట్ కావడంతో దానికి సీక్వెల్‌గా పుష్ప 2 ది రూల్ రానుంది. మరో రెండు రోజుల్లో ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ సినిమా కోసం అల్లు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తమ హీరో బొమ్మ ఎప్పుడు రిలీజ్ అవుతుందా కొన్నినెలలుగా ఎదురుచూస్తున్నారు. విడుదలకు సమయం దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్లలో స్పీడ్ పెంచారు. భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తాజాగా నిన్న హైదరాబాద్ యూసుఫ్‌గూడలోని పోలీస్ గ్రౌండ్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

    డిసెంబర్ 5న పుష్ప 2 చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒకరోజు ముందుగా అంటే డిసెంబర్ 4న తెలుగు రాష్ట్రాల్లో సెలక్టడ్ థియేటర్లలో ప్రీమియర్ షోలు వేయబోతున్నారు. అభిమానులు ఇప్పటికే వేలకు వేల రూపాయలు వెచ్చించి సినిమా టిక్కెట్లు ముందస్తుగా కొనుగోలు చేశారు. సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.. ఈ క్రమంలో సినిమాపై అంచనాలు పెంచేందుకు నిన్న హైదరాబాద్‌లో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథులుగా విచ్చేసిన టాలీవుడ్ దర్శకులు, పుష్ప 2పై బన్నీని ప్రశంసలతో ముంచెత్తారు. బన్నీ ప్రతి ఒక్కరినీ కదిలించే ప్రసంగం ఇచ్చారు.

    ఈ ఈవెంట్లో అల్లు అర్జున్ మాట్లాడుతుండగా ఒక్కసారిగా ఓ అభిమాని వేగంగా స్టేజిపైకి దూసుకొచ్చాడు. వెంటనే అక్కడున్న బౌన్సర్లు అతడు రావడాన్ని గమనించి ఆ అభిమానిని పక్కకి లాగేస్తుండగా.. ఆ అభిమాని అన్న ఒక్క ఫోటో అన్న అని అరుస్తుండడంతో బన్నీ బౌన్సర్లు ని వదిలేయమని చెప్పి అతన్ని పిలిచి ఫోటో ఇచ్చారు. దీంతో అతను చాలా హ్యాపీగా జై బన్నీ అంటూ వెళ్ళాడు. ఈ సంఘటనతో అల్లు అర్జున్ మాట్లాడుతూ.. నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చి అబ్బా. నా ఫ్యాన్స్, నా ఆర్మీ లవ్ యూ అంటూ ఫ్యాన్స్ కు థ్యాంక్స్ అని చెప్పాడు అల్లు అర్జున్. కానీ ఇలాంటివి మాత్రం చేయకండి అని సూచించారు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది.

    ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న నటించింది. శ్రీలీల స్పెషల్ సాంగ్ కిస్సిక్ చేసింది. వీరితో పాటు జగపతి బాబు, సునీల్, అనసూయ తదితరులు నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను చాలా గ్రాండ్ గా తెరకెక్కించారు. దేవీ శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించారు.