Pushpa 2 Pre Release Event: ఇండియా పుష్ప 2 ఫీవర్ తో ఊగిపోతోంది. ఈ సినిమాకు ఎంత డిమాండ్ ఉందో అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే అర్థం అవుతుంది. రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ ఉన్నాయి. పుష్ప 2 టికెట్స్ ధరలు భారీగా పెంచారు. అయినప్పటికీ ప్రేక్షకుల్లో ఎక్కడా అసహనం లేదు. అధిక ధరలకు టికెట్స్ కొనేందుకు ప్రేక్షకులు వెనకాడటం లేదు. డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ 12000 లకు పైగా థియేటర్స్ లో పుష్ప 2 విడుదల కానుంది. మొత్తంగా ఆరు భాషల్లో అందుబాటులోకి రానుంది.
ఈ క్రమంలో హైదేరాబద్ లో చివరి ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. పుష్ప 2 ఈవెంట్ కి ముఖ్య అతిథిగా దర్శకుడు రాజమౌళి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పుష్ప పార్ట్ 1 ప్రీ రిలీజ్ ఈవెంట్లో నేను ఇదే వేదిక మీద నిల్చుని ఒక మాట అన్నాను. బన్నీ నువ్వు నార్త్ ని వదలొద్దు. అక్కడ నీ ఫ్యాన్స్ చచ్చిపోతున్నారు. సినిమాను బాగా ప్రమోట్ చేయమని చెప్పాను.
కానీ పుష్ప 2 చిత్రానికి ఎలాంటి ప్రమోషన్స్ అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఈ సినిమా జనాల్లోకి వెళ్ళిపోయింది. ఇండియాతో పాటు ప్రపంచంలో ఎక్కడ తెలుగు వాళ్ళు ఉన్నా ఈ సినిమాను చూస్తారు. ఆల్రెడీ టికెట్స్ కూడా కొనేశారు. మనం సినిమా గురించి, హీరో, డైరెక్టర్.. ఇంకా ఏదైనా మాట్లాడి ప్రత్యేకంగా ఈ సినిమాకు ప్రచారం కల్పించాల్సిన అవసరం లేదు. అందుకే జరిగిన ఓ సంఘటన చెబుతాను.
ఓ మూడు నెలల క్రితం నేను రామోజీ ఫిలిం సిటీకి పని మీద వెళ్ళాను. అక్కడ పుష్ప 2 షూటింగ్ జరుగుతుంది. సెట్స్ కి వెళితే… నాకు సుకుమార్ పుష్ప రాజ్ ఇంట్రో సీన్ చూపించాడు. ఆ సీన్ ఎలా ఉంది అంటే.. మ్యూజిక్ డైరెక్టర్ దేవి ఎంత కావాలంటే అంత ఇవ్వొచ్చు. మాగ్జిమమ్ ఇవ్వొచ్చు. ఆ రేంజ్ లో ఉంది. ఇంట్రో సీన్ అలా ఉంది అంటే.. ఇక సినిమా మొత్తం అద్బుతంగా ఉందని అంచనా వేయవచ్చు. ఈ మూవీ ఆల్రెడీ సక్సెస్. అందుకే నేను ఆల్ ది బెస్ట్ కూడా చెప్పను. డిసెంబర్ 5న… కాదు ఒక రోజు ముందే పుష్ప 2 థియేటర్స్ లోకి రానుంది.. అన్నారు.