big movies : సినిమా ఇండస్ట్రీలో పెరిగిన బడ్జెట్ ను రికవరీ చేసుకోవడానికి ప్రొడ్యూసర్స్ భారీ రేంజ్ లో టికెట్ రేట్ ను పెంచుతున్నారు. నిజానికి టికెట్ రేట్ అనేది ప్రేక్షకుడిని సినిమా చూడాలా వద్దా అని డిసైడ్ చేసే ఫ్యాక్టర్ గా నిలిచిపోతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… మరి దీనివల్ల సినిమాకి ప్లస్ అవుతుందా.? లేదంటే మైనస్ అవుతుందా.?అనేది తెలియాల్సి ఉంది…
భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న సినిమాల విషయంలో ప్రొడ్యూసర్స్ గానీ, గవర్నమెంట్ గాని కొన్ని స్ట్రాటజీ లను అయితే మెయిటైన్ చేస్తున్నారు. ఇక మొత్తానికైతే సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోల సినిమాల విషయంలో టికెట్ రేట్లను భారీగా పెంచడమే కాకుండా వాళ్ళకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటి క్రియేట్ చేయడంలో అందరూ కీలకపాత్ర వహిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ప్రేక్షకులు సైతం ఆ సినిమాల మీద ఉన్న ఇంట్రెస్ట్ తో టికెట్ రేట్లు ఎంతలా పెంచినా కూడా సినిమాని చూడాలనే ఉత్సాహంతో ముందుకు సాగుతున్నారు. ఇంకా టికెట్ రేట్లను పెంచడం వల్ల చాలామంది థియేటర్ కి వెళ్లి చూసే ఇంట్రెస్ట్ ని కోల్పోవచ్చు. నిజానికి సినిమా అంటే పిచ్చి ఉన్న వాళ్ళు మాత్రమే మొదటి రోజు సినిమాను చూడడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు… జస్ట్ టైం పాస్ కోసం చూసేవాళ్ళు అయితే ఇవాళ్ళ కాకపోతే రేపైనా ఆ సినిమాను చూడొచ్చులే అని లైట్ తీసుకుంటూ ఉంటారు. ఇక పెరిగిన టికెట్ రేట్ల వల్ల వాళ్లు థియేటర్ కి వచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఇక ఎలాగో ఏ సినిమా అయినా కూడా ఒక 20 రోజులు గడిస్తే ఓటిటిలోకి వస్తుంది. కాబట్టి అక్కడ చూసి ఎంజాయ్ చేయొచ్చులే అనుకొని సినిమా చూడకుండా ఉండే వాళ్లు కూడా చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. కాబట్టి ఈ పెరిగిన టికెట్ రేట్ల వల్ల ఎంతైతే కలెక్షన్స్ వస్తాయో అంతే కలెక్షన్స్ కూడా మైనస్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి.
కాబట్టి సగటు ప్రేక్షకుడు సినిమా థియేటర్లో సినిమా చూడాలి అని అనుకునేలా టికెట్ రేట్లు ఉంటే బాగుంటుందంటూ కొంతమంది సినీ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఒక రకంగా పెరిగిన టికెట్ రేట్లు ఎంత ప్లస్ అవుతున్నాయో అంతే మైనస్ గా కూడా మారుతున్నాయి.
ఇక ఇలాంటి ధోరణిని అరికట్టడానికి ఏం చేయాలి పెరిగిన బడ్జెట్ ను రికవరీ చేసుకోవాలంటే ప్రొడ్యూసర్ దగ్గర ఉన్న ఒకే ఒక ఆప్షన్ టికెట్ రేట్ పెంచడం. మరి ఆయన వేలో ఆయన కరెక్ట్ గానే ఉన్నాడు.ఇక ప్రేక్షకులు సైతం వాళ్లు ఎంటర్ టైన్ అయ్యేలా సినిమా ఉంటే డబ్బులు వెచ్చించడానికి వాళ్ళు ఆసక్తి చూపిస్తారు.
కానీ ఒకవేళ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడం లేదంటే ప్రేక్షకులు పెట్టిన డబ్బులకి అతను సాటిస్ఫై అవ్వకపోవడం గాని జరిగితే ఆ సినిమా మీద గాని, డైరెక్టర్ల మీద గాని, హీరో మీద గానీ తీవ్రమైన విమర్శలను చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. తద్వారా సినిమాకి భారీగా మైనస్ అయ్యే అవకాశాలైతే లేకపోలేదు…