Pushpa 2 Pre Release Event: పుష్ప 2 డిసెంబర్ 5న విడుదల కానుంది. హైదరాబాద్ లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేదికపై దర్శకుడు సుకుమార్ మాట్లాడారు. ”నేను ఆల్రెడీ అలసిపోయాను, మా ప్రొడ్యూసర్స్ ఇప్పుడే చెప్పారు. సమయం 11 గంటలు అయ్యింది, త్వరగా ముగిద్దాం అన్నారు. అందుకే పేరు పేరునా చెప్పలేను. బన్నీ ఎలా ఎదుగుతూ వస్తున్నాడో మొదటి నుండి దగ్గరగా చూస్తున్నాను. ఆయన మీద ఉన్న ప్రేమ కారణంగానే పుష్ప 2 సాధ్యమైంది. మా ఇద్దరి మధ్య ఎప్పుడు ఎనర్జీ ఎక్స్ఛేంజ్ అవుతుంది. ఒక ఎక్స్ప్రెషన్ కోసం కూడా అల్లు అర్జున్ ఫైట్ చేస్తాడు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా.. నీ మీద ప్రేమతోనే ఈ మూవీ చేశాను.
నీతో సినిమా చేసే నాటికి నా దగ్గర కథ లేదు. నీకు కొన్ని సీన్స్, అలాగే సినిమా ఇలా ఉంటుందని లైన్ చెప్పాను. నీలోని తపన చూసి మాకు మోటివేషన్ వచ్చేది. ఈయన కోసం ఏమైనా చేయవచ్చు అనిపించేది. అల్లు అర్జున్ ఒక హైట్ క్రియేట్ చేశాడు. అక్కడకు మనం కూడా వెళ్ళాలి. అక్కడ కూర్చోబెట్టి పని చేయిస్తాడు. ఐ లవ్ యూ డార్లింగ్. నీ మీద ప్రేమే ఈ సినిమా.
అల్లు అర్జున్ జీవితంలో 3 సంవత్సరాలు తీసుకున్నాను. ఆయన మరో మూడేళ్లు సమయం ఇస్తాను అంటే పుష్ప 3 తీస్తాను. థాంక్యూ డార్లింగ్… నీ ప్రైమ్ టైం లో మూడేళ్లు నాకు కేటాయించారు. మైత్రీ మూవీ మేకర్స్ గ్రోత్ చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. అసలు చెర్రీ వలనే పుష్ప మూవీ రెండు భాగాలు అయ్యింది. శ్రీవల్లి (రష్మిక)గురించి మాట్లాడాలి.. ఆమె ఎక్స్ ప్రెషన్స్ చూస్తూ నేను ఉండిపోతున్నాను. గర్ల్ ఫ్రెండ్ టీజర్ చూస్తే. అన్ని క్లోజప్ షాట్స్ ఉన్నాయి.
దేవిశ్రీ గురించి చెప్పాలంటే… నేను ఒకరిని ప్రేమించాను అంటే… వాళ్లతో నా జర్నీ సాగుతూనే ఉంటుంది. అద్భుతమైన బీజీఎం ఇచ్చావు. శ్రీలీల మెస్మరైజింగ్ స్టెప్స్ ఆకట్టుకున్నాయి.. శ్రీలీల తెలుగు బాగా మాట్లాడుతుంది. మెసేజ్ లు కూడా తెలుగులో పంపుతుంది… అన్నారు, మిగతా సాంకేతిక నిపుణులకు ఆయన ధన్యవాదాలు తెలిపి, ముగించారు. కాగా సుకుమార్ తన గురించి మాట్లాడుతుంటే అల్లు అర్జున్ ఎమోషనల్ అయ్యాడు. కన్నీరు పెట్టుకున్నారు. నీ కోసమే, నీ పై ప్రేమతోనే ఈ సినిమా చేసానని సుకుమార్ పదే పదే అన్నాడు.
Web Title: Pushpa 2 pre release event allu arjun shed tears at sukumars words
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com