Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2 : ది రూల్’ రేపు ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం కన్నడ, హిందీ మరియు తమిళ భాషల్లో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రీమియర్ షోస్ నేడు కాసేపటి క్రితమే రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదలయ్యాయి. టాక్ కూడా మరో గంటలో సోషల్ మీడియా మొత్తం పాకేస్తుంది. పాజిటివ్ టాక్ వస్తే మాత్రం ఇండస్ట్రీ రికార్డ్స్ షేక్ అవుతాయి. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఈ చిత్రం సరికొత్త రికార్డ్స్ ని నెలకొల్పి ముందుకు దూసుకుపోతుంది. ఇలా అభిమానులు ఆనందకరమైన వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్న ఈ సమయంలో కర్ణాటక లో మిడ్ నైట్ షోస్, మార్నింగ్ షోస్ బ్యాన్ అవ్వడం అభిమానులను కాస్త నిరాశకు గురిచేసింది. సోషల్ మీడియా లో ఇప్పుడు దీని మీద పెద్ద రచ్చ జరుగుతుంది.
ఇలాంటి సమయంలో కాసేపటి క్రితమే అల్లు అర్జున్ ట్విట్టర్ లో తన కొడుకు అల్లు అర్జున్ రాసిన లేఖను షేర్ చేస్తూ బాగా ఎమోషనల్ అయ్యాడు. ఆ లేఖలో ఏముందంటే ‘ఈ లేఖను నేను ఒక కొడుకుగా నా తండ్రి పట్ల ఎంత గర్వంగా ఉన్నానో చెప్పడానికి రాస్తున్నాను. మీ కష్టం, పట్టుదలతో వచ్చిన ఈ సక్సెస్ ని చూస్తే ఈ ప్రపంచంలోనే నేను టాప్ అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. ఒక వరల్డ్ గ్రేటెస్ట్ యాక్టర్ సినిమా నేడు విడుదల అవ్వబోతుండగా, ఈరోజుని ఎంతో స్పెషల్ గా భావించవచ్చు. పుష్ప అనేది కేవలం ఒక సినిమా కాదు, ప్రయాణం. అంతే కాకుండా ఈ సినిమా నటన పట్ల నీకున్న ఇష్టాన్ని తెలియచేసే సినిమాగా నిలవబోతుంది. ఈ సందర్భంగా నీకు ఆల్ ది బెస్ట్ చెప్పడం నా అదృష్టం గా భావిస్తున్నాను. సినిమా ఫలితం ఎలా ఉన్నా నాకు పర్వాలేదు, నువ్వే నా హీరో..నా లెజెండ్’ అంటూ చెప్పుకొచ్చాడు.
ఈ ప్రపంచం మొత్తం నీకు అసంఖ్యాకమైన అభిమానులు ఉండొచ్చు, కానీ నేను మాత్రం వాళ్లందరికంటే పెద్ద ఫ్యాన్ ని అని చెప్పగలను అంటూ అల్లు అయాన్ చాలా ఎమోషనల్ ఈ లేఖని రాస్తాడు. దీనిని అల్లు అర్జున్ షేర్ చేస్తూ, నా జీవితం లో నేను సాధించిన గొప్ప విజయాల్లో ఇది కూడా ఒకటి అంటూ చెప్పుకొచ్చాడు. చిన్న వయస్సులోనే అల్లు అయాన్ కి ఇంత పెద్ద మాటలు మాట్లాడడానికి వచ్చిందంటే, అతని మెచ్యూరిటీ లెవెల్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అంతే కాకుండా అతనికి తన తండ్రి అంటే ఎంత ప్రేమనో అర్థం అవుతుంది. చిన్న వయస్సులోనే అల్లు అర్జున్ తన పిల్లల్ని పెంచిన తీరుని చూసి ఎవరైనా మెచ్చుకోవలసిందే. భవిష్యత్తులో అల్లు అయాన్ ఇదే లక్షణాలతో పెరిగితే తండ్రిని మించిన తనయుడు కూడా అవ్వొచ్చు.
Touched by my son ayaan’s letter pic.twitter.com/dLDKOvb6jn
— Allu Arjun (@alluarjun) December 4, 2024