Pushpa 2 : అల్లు అర్జున్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘పుష్ప 2: ది రూల్’ గురువారం థియేటర్లలోకి రానుంది. బుధవారం రాత్రి 8 గంటల వరకు అడ్వాన్స్ బుకింగ్ ద్వారా ఈ చిత్రం రూ.79.36 కోట్లు రాబట్టింది. డిసెంబర్ 5న ‘పుష్ప 2: ది రూల్’ చరిత్ర సృష్టిస్తుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇది అన్ని రికార్డులను బద్దలు కొట్టడంతోపాటు భారతీయ సినిమాల్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలవనుంది. పుష్ప 2 మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ నుండి 270 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని అంచనా. ఈ అంచనా కరెక్ట్ అయితే ఇప్పటి వరకు బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘RRR’ సినిమా రికార్డును అల్లు అర్జున్ సినిమా బ్రేక్ చేస్తుంది. ‘RRR’ మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ నుండి 223.5 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది.
భారతీయ సినిమా చరిత్రలో తొలిరోజు రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన సినిమాలు 14 ఉన్నాయి. ‘పుష్ప 2’ తొలిరోజు వరల్డ్ వైడ్ గా రూ.230 కోట్ల బిజినెస్ చేస్తే.. ఈ 14 సినిమాలను అధిగమించి చరిత్ర సృష్టిస్తుంది. ‘పుష్ప 2 : ది రూల్’ ప్రీమియర్ షోస్ ఆల్రెడీ పడిపోయాయి. అనేక ప్రాంతాల్లో ఈ సినిమాకు టికెట్ రేట్లు వెయ్యి కి పైగా పెట్టారు. అయినప్పటికీ కూడా హాట్ కేక్స్ లాగా అమ్ముడుపోవడం గమనార్హం. యూత్ లో ప్రస్తుతం అల్లు అర్జున్ క్రేజ్ వేరే లెవెల్ లో ఉంది అనేందుకు ఇదే ఉదాహరణ. నార్త్ అమెరికా లో కేవలం ప్రీమియర్ షోస్ నుండే మూడు మిలియన్ డాలర్స్ వచ్చే ఛాన్సులు ఉన్నాయట. కేవలం తెలుగు లో మాత్రమే కాదు, హిందీ లో కూడా ఈ సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ వేరే లెవెల్ లో జరిగాయని ట్రేడ్ పండితులు చెప్తున్నారు.
కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఈ సినిమాకి వరల్డ్ వైడ్ గా వంద కోట్లు గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు తెలుస్తుంది. ఇది ఇలా ఉండగా ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రివ్యూ షో దుబాయి లోని కొంతమంది ప్రముఖులకు ప్రత్యేకంగా వేసి చూపించారట. వాళ్ళ నుండి ఈ సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చినట్టు తెలుస్తుంది. దీంతో పాటు దేశంలోని అన్ని థియేటర్ల దగ్గర ‘పుష్ప 2′ జాతర నడుస్తోంది. బెంగుళూరులో అల్లు అర్జున్ 85 అడుగుల ఎత్తున్న కటౌట్‌ని ఏర్పాటు చేశారంటే ఈ సినిమా క్రేజ్‌ని అంచనా వేయవచ్చు. అల్లు అర్జున్ అభిమానుల సంఘం సోషల్ మీడియాలో కటౌట్ చిత్రాలను పంచుకుంది. పుష్ప’ అధికారిక ట్విటర్ హ్యాండిల్లో కూడా ఈ ఫోటోలను పోస్ట్ చేశారు. అల్లు అర్జున్ ‘పుష్ప 2’ కూడా ఇప్పటి వరకు తెరపై విడుదలైన అతిపెద్ద భారతీయ చిత్రం. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా 12.5 వేల స్క్రీన్లలో విడుదల చేస్తున్నారు. ముంబైలో ఏర్పాటు చేసిన ప్రమోషనల్ ఈవెంట్‌లో అల్లు అర్జున్ స్వయంగా ఈ విషయాన్ని తెలియజేశారు.
Presenting you the 85ft biggest cutout for any TFI actor in Bengaluru #Pushpa2TheRule @alluarjun pic.twitter.com/KaSDskaytb
— Allu Arjun Fans Karnataka™ (@AIAAFAKarnataka) December 4, 2024
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Photos of pushpa rajs 85 foot cutout in bengaluru go viral on social media
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com