Sukumar: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇంటలిజెంట్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న డైరెక్టర్ సుకుమార్… ప్రస్తుతం ఆయన చేస్తున్న ప్రతి సినిమా విషయంలో ఇండస్ట్రీలో భారీ బజ్ అయితే క్రియేట్ అయింది. ఇక ఇప్పుడు ఆయన చేస్తున్న పుష్ప 2 సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇక ఈ సినిమా కనక సూపర్ సక్సెస్ అయితే పాన్ ఇండియాలో నెంబర్ వన్ డైరెక్టర్ గా ఎదిగే అవకాశాలు కూడా సుకుమార్ కు ఉన్నాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా ఆల్మోస్ట్ సక్సెస్ ని సాధిస్తుందనే ఉద్దేశ్యంతోనే చాలామంది బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ సైతం సుకుమార్ చేత తమ బ్యానర్ లో అతని చేత ఒక్క సినిమా ఆయన చేయించుకోవాలని ఉద్దేశ్యంతో అందరూ ఉత్సాహాన్ని చూపిస్తున్నారట. కానీ సుకుమార్ మాత్రం ఎవరి బ్యానర్ లో నుంచి కూడా ప్రస్తుతానికి అడ్వాన్స్ తీసుకోవడం లేదు. ఎందుకంటే ఈ సినిమా తర్వాత ఆయన రామ్ చరణ్ తో సినిమా చేయబోతున్నాడనే విషయం మనకు తెలిసిందే.
ఇక ఆ సినిమా కూడా మైత్రి మూవీ మేకర్స్ లోనే ఉండబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. మరి వీళ్ళ కాంబోలోనే మరికొన్ని సినిమాలు చేసే ఆలోచనలో సుకుమార్ ఉన్నాడట. ఇక వేరే ప్రొడ్యూసర్ కి ఇప్పుడప్పుడే సినిమా చేసే ఉద్దేశం అయితే సుకుమార్ కి లేదని తెలుస్తోంది. మరి ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే సుకుమార్ తనదైన రేంజ్ లో సినిమాలు చేయడానికి తనకు అవకాశం ఇచ్చిన మైత్రి మూవీ మేకర్స్ వాళ్లతోనే సినిమాలు చేస్తూ ముందుకు సాగుతానని ఉద్దేశంతో ఉన్నట్టుగా తెలుస్తోంది.
మరి ఆయన అనుకున్నట్టుగానే మైత్రి వాళ్లతో ఇంకెన్ని సినిమాలు చేస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా కూడా సుకుమార్ కి భారీ రేంజ్ లో క్రేజ్ పెరగడం అనేది నిజంగా గొప్ప విషయం అని చెప్పాలి. బాలీవుడ్ ప్రొడ్యూసర్లు సైతం అతని కోసం క్యూ కడుతున్నారు అంటే ఆయన ఇమేజ్ ఏ రేంజ్ లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు.
ఇక దానికి అనుగుణంగానే సుకుమార్ కూడా తన తదుపరి సినిమాలను సూపర్ హిట్టుగా తీర్చిదిద్దడానికి తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నాడట… చూడాలి మరి పుష్ప 2 సినిమా కనక సూపర్ సక్సెస్ సాధిస్తే ఇకమీదట ఆయన రేంజ్ అనేది మారిపోవడమే కాకుండా తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శకుడిగా సుకుమార్ ని కూడా వేరే రేంజ్ కి వెళ్ళిపోతాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…