Pushpa 2 The Rule : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ చిత్రం కాసేపట్లో ప్రీమియర్ షోస్ ని ప్రారంభించుకోబోతుంది. సినిమా టాక్ కోసం లక్షలాది మంది అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ‘పుష్ప’ చిత్రం తర్వాత అల్లు అర్జున్ మరో సినిమా చేయకుండా, మూడేళ్లు ఈ చిత్రం కోసమే తన విలువైన సమయాన్ని కేటాయించాడు. కష్టానికి తగ్గ ఫలితం దక్కింది. కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ఈ సినిమాకి వంద కోట్ల రూపాయిల గ్రాస్ ఇప్పటి వరకు వచ్చిందంటేనే అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా బాలీవుడ్ మార్కెట్ పుష్ప మేనియా లో మునిగి తేలుతుంది. ఈ స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్, అది కూడా మిడ్ వర్కింగ్ డే రోజున ఒక బాలీవుడ్ చిత్రానికి ఇప్పటి వరకు జరగలేదు. కేవలం ‘పుష్ప 2’ విషయంలోనే అది జరిగింది. ‘బుక్ మై షో’ లో గంటకి 80 వేల టిక్కెట్లు అమ్ముడుపోతున్నాయి.
కల్కి (91 వేలు) తర్వాత ఆ స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్ కేవలం ‘పుష్ప 2’ కి మాత్రమే ఇప్పటి వరకు జరిగింది. ఇదంతా పక్కన పెడితే ‘పుష్ప 2’ చిత్రానికి కర్ణాటక లో తీరని అన్యాయం జరిగింది. సినిమాకి ఉన్నటువంటి క్రేజ్ కారణంగా బయ్యర్స్ భారీ స్థాయిలో బెన్ఫిట్ షోస్, మార్నింగ్ షో ని ప్లాన్ చేశారు. కానీ కన్నడ సినీ పరిశ్రమ నిర్మాతల మండలి వీటిని రద్దు చేయాలంటూ ఫిర్యాదు చేయడంతో బెంగుళూరు సిటీ కలెక్టర్ మిడ్ నైట్ షోస్, మార్నింగ్ షోస్ ని క్యాన్సిల్ చేయాలంటూ ఉత్తర్వులు జారీ చేసారు . కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ తోనే నాలుగు కోట్ల 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమాకి మార్నింగ్ షోస్ రద్దు అవ్వడం వల్ల దాదాపుగా కోటి రూపాయిల గ్రాస్ నష్టపోయి ఉండొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
మన తెలుగు రాష్ట్రాల్లో ఇతర బాషా చిత్రాలకు భారీ స్థాయిలో షోస్ ని కేటాయిస్తారు మన తెలుగు బయ్యర్స్. అంతే కాదు ఈ అనువాద చిత్రాల కారణంగా మన తెలుగు సినిమాలకు తక్కువ షోస్ దక్కిన రోజులు ఉన్నాయి. అలాంటిది కర్ణాటక ప్రాంతంలో మన సినిమాలను కుట్ర పూరితంగా ఏ రేంజ్ లో తొక్కుతున్నారో మీరే చూడండి. ఇది చాలా అన్యాయం అంటూ సోషల్ మీడియా లో అల్లు అర్జున్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. నెటిజెన్స్ కూడా ఈ విషయం పై ఫుల్ ఫైర్ మీద ఉన్నారు. అనువాద చిత్రాలకు కూడా మన తెలుగు రాష్ట్రాల్లో ఇదే విధంగా చేయాలంటూ అధికారులను ట్విట్టర్ లో ట్యాగ్ చేసి డిమాండ్ చేస్తున్నారు. అయితే అరచేతితో సూర్యుడిని ఆపడం కష్టం అనేది ఎంత నిజమో, పుష్ప 2 ప్రభంజనం ని కర్ణాటక లో అడ్డుకోవడం కూడా అంతే కష్టం అంటూ సోషల్ మీడియా లో అల్లు అర్జున్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.